Begin typing your search above and press return to search.

నీ బ్యాంక్ డీటైల్స్ పంపు..ఆన్ లైన్ షాపింగ్ చేస్తా!

By:  Tupaki Desk   |   7 April 2020 1:20 PM IST
నీ బ్యాంక్ డీటైల్స్ పంపు..ఆన్ లైన్ షాపింగ్ చేస్తా!
X
లాక్ డౌన్ కారణంగా ఇప్పుడు సెలెబ్రెటీలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ ఖాళీ సమయంలో షూటింగ్ లేకపోవడంతో టీవీల్లో కూడా సీరియల్స్, వివిధ వినోద కార్యక్రమాలు రావడం లేదు. దీంతో పాత సినిమాలు, రిపీట్ గా కొత్త సినిమాలు వేస్తున్నారు. అందులో కొత్తదనం లేకపోవడంతో చాలా మంది సీనీ ప్రముఖులు.. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ లాంటి ఓటీటీ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్ వైపు మొగ్గుతున్నారు. వినోదాన్ని చూస్తున్నారు.

ఈ క్రమంలో ప్రముఖ తెలుగు నటి మంచు లక్ష్మీ సైతం నెట్ ఫ్లిక్స్ లో ‘టైగర్ కింగ్’ సినిమా చూస్తూ పడుకుందట.. ఈ సినిమా బాగుందని సోషల్ మీడియాలో పేర్కొంది. ఈ సిరీస్ ను వినియోగదారులు చూడొచ్చని ఉచిత సలహా ఇచ్చింది. ఇక తాజాగా ఖాళీగా ఉన్న మంచు లక్ష్మీ ట్విట్టర్ లో అభిమానులతో చిట్ చాట్ ను నిర్వహించింది.

అయితే ఓ నెటిజన్ మంచు లక్ష్మీని ట్విట్టర్ లో తుంటరి ప్రశ్నను కామెంట్ రూపంలో అడిగేశాడు. ‘అక్కా నీ నెట్ ఫ్లిక్స్ అకౌంట్ డీటైల్స్ ఇవ్వవా? నేను ఆ సినిమా చూస్తాను’ అని అభ్యర్థించాడు.

దీనికి మంచు లక్ష్మీ కూడా అంతే సరదాగా సమాధానమిచ్చింది.. ‘నీ బ్యాంకు డీటైల్స్ పంపు తమ్ముడు.. నేను ఆన్ లైన్ షాపింగ్ చేసుకుంటాను’ అని దిమ్మదిరిగే సమాధానం ఇచ్చింది. ఈ ట్వీట్స్ నెటిజన్స్ ను ఎంతగానో ఆకట్టుకున్నాయి.