Begin typing your search above and press return to search.

అమ్మ ప్రేమ‌ను మించిన‌ది ఇంకేది.. మంచు ల‌క్ష్మి ఉద్వేగం!

By:  Tupaki Desk   |   7 Sept 2020 1:40 PM IST
అమ్మ ప్రేమ‌ను మించిన‌ది ఇంకేది.. మంచు ల‌క్ష్మి ఉద్వేగం!
X
లక్ష్మిమంచు డైన‌మిజం గురించి ఎంత చెప్పినా త‌క్కువే. న‌టి.. నిర్మాత.. యాంక‌ర్.. మామ్.. ఇలా ఆల్ రౌండ‌ర్ క్వాలిటీస్ తో స‌త్తా చాటిన ఏకైక లేడీగా సుప‌రిచితం. ఇక ఇటీవ‌లి కాలంలో సోష‌ల్ మీడియాల్లో ల‌క్ష్మీ మంచు ఎంతో జోష్ చూపిస్తున్నారు.

నిరంత‌రం బేబి నిర్వాణ మంచుతోనే కాల‌క్షేపం. తాజాగా నిర్వాణ‌తో క‌లిసి తాను దిగిన కొన్ని ఫోటోల్ని ల‌క్ష్మి మంచు షేర్ చేసారు. గారాల ప‌ట్టీ మామ్ తో పాటు ఎంత జోయ్ తో హుషారుగా ఉందో ఈ ఫోటోలు చూస్తుంటే అర్థ‌మ‌వుతోంది. ఇంట్లో కాల‌క్షేపం అదిరింది. ఇక ఎవ్వ‌ర్ లేటెస్ట్ ఫోటోషూట్ లో గాగుల్స్ ధ‌రించి ఆ ఇద్ద‌రూ ఇచ్చిన ఫోజు ఆల్బ‌మ్ కే హైలైట్ అని చెప్పొచ్చు.

``నా ఆదర్శ ఆదివారం ప్రణాళిక.. నా మనోహరమైన మినీ-మి(నిర్వాణ‌)తో ఎక్కువ‌ సమయాన్ని గడపడం.. నవ్వును పంచుకోవడం .. రోజంతా ప్రేమను వ్యాప్తి చేయడం!`` అంటూ ఎంతో ఎగ్జ‌యిటింగ్ గా చెప్పుకొచ్చారు ల‌క్ష్మీ. క్రియేటింగ్ మెమ‌రీస్.. బాండింగ్ విత్ నిర్వాణ‌! అంటూ ల‌క్ష్మీ మంచు ఎంతో ఎమోష‌న‌ల్ గా క‌నిపిస్తున్నారు. గారాల డాట‌ర్ విద్యా నిర్వాణ అంటే ల‌క్ష్మీకి అప‌రిమిత‌మైన ప్రేమ అని అర్థ‌మ‌వుతోంది క‌దూ?