Begin typing your search above and press return to search.

మ‌ల‌యాళ మూవీతో మంచు ల‌క్ష్మి భ‌లే షాకిచ్చేసింది!

By:  Tupaki Desk   |   9 Dec 2022 4:15 AM GMT
మ‌ల‌యాళ మూవీతో మంచు ల‌క్ష్మి భ‌లే షాకిచ్చేసింది!
X
క‌లెక్ష‌న్ కింగ్ న‌ట‌వార‌సురాలిగా 'అన‌గ‌న‌గా ఒక ధీరుడు' సినిమాతో తెరంగేట్రం చేసిన మంచు ల‌క్ష్మి తొలి చిత్రంలో మంత్ర గ‌త్తె ఐరేంద్రిగా న‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. అయితే ఆ త‌రువాత ఆమె న‌ట‌న‌ని ఆ స్థాయిలో రాబ‌ట్టిన సినిమాలేవీ రాక‌పోవ‌డంతో మంచు ల‌క్ష్మి ప్ర‌త‌భ పూర్తి స్థాయిలో బ‌య‌టికి రాలేక‌పోయింది. రొటీన్ క‌థ‌లు, పాత్ర‌లే వ‌స్తుండ‌టంతో గ‌త కొంత కాలంగా సినిమాల‌కు దూరంగా వుంటూ వ‌స్తోంది. 'పిట్ట‌క‌థ‌లు' అంథాల‌జీలో స్వ‌రూప‌క్క‌గా న‌టించి ఆక‌ట్టుకుంది.

కానీ త‌నలో వున్న పూర్తి స్థాయి న‌టిని బ‌య‌టికి తీసే పాత్ర‌లో మంచు ల‌క్ష్మి న‌టించ‌లేదు. అలాంటి పాత్ర‌నే తాజాగా మ‌ల‌యాళ మూవీ 'మాన్ స్ట‌ర్‌'లో చేసి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. వివ‌రాల్లోకి వెళితే..మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ హీరోగా న‌టించిన మూవీ 'మాన్ స్ట‌ర్‌'. హ‌నీరోజ్ న‌టించిన ఈ మూవీలో మంచు ల‌క్ష్మి కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఇది త‌ను న‌టించిన తొలి మ‌ల‌యాళ మూవీ. ఇందులో మోహ‌న్ లాల్ ల‌క్కీ సింగ్ గా సీక్రెట్ పోలీస్ పాత్ర‌లో న‌టించాడు.

షాకింగ్ విష‌యం ఏంటంటే ఇందులో మంచు ల‌క్ష్మి మాత్రం హ‌నీ రోజ్ ఇంట్లో ప‌నిమ‌నిషిగా, త‌న‌తో రిలేష‌న్ లో వున్న లెస్బియ‌న్ గా న‌టించింది. ఓ సీన్ లో ఇద్ద‌రి మ‌ధ్య లిప్ లాక్ లు వుండ‌టం ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. 'మ‌న్యం పులి' ద‌ర్శ‌కుడు వైసాఖ్ ఈ మూవీని తెర‌కెక్కించాడు. యాక్ష‌న్ క్రైమ్ థ్రిల్ల‌ర్ గా తెర‌కెక్కిన ఈ మూవీ అక్టోబ‌ర్ 21ని విడుద‌లైంది. అయితే ఈ మూవీ తెలుగు వెర్ష‌న్ ని డిసెంబ‌ర్ 2న డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్ లో రిలీజ్ చేశారు.

క్రైమ్ థ్రిల్ల‌ర్ గా సాగిన ఈ మూవీ మోహ‌న్ లాల్ గ‌త చిత్రాలకు భిన్నంగా ఓ సీరియ‌ల్ లా సాగుతుంద‌ని తెలుస్తోంది. గంట‌న్న‌ర‌పాటు ఎలాంటి ఆస‌క్తిని రేకెత్తించ‌ని ఈ మూవీ మంచు ల‌క్ష్మీ క‌నిపించే చివ‌రి 30 నిమిషాలు మాత్రం ప్ర‌ధాన హైలైట్‌గా నిలిచిన‌ట్టు తెలుస్తోంది.

హ‌నీరోజ్ తో రిలేష‌న్ లో వున్న లెస్బియ‌న్ గా, త‌న‌తో రొమాన్స్ చేసే స‌న్నివేశాల్లో మంచు ల‌క్ష్మి త‌న న‌ట‌న‌తో షాకివ్వ‌డం కాయం అని తెలుస్తోంది. అంతే కాకుండా విల‌న్ గానూ మోహ‌ప‌న్ లాల్ తో క‌లిసి యాక్ష‌న్ ఘ‌ట్టాల్లోనూ న‌టించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ షాక్ కు గురి చేస్తోంది.

సినిమా మొత్తానికి మంచు ల‌క్ష్మి క్యారెక్ట‌ర్ హైలైట్ గా నిల‌వ‌డంతో ఇప్ప‌డు త‌ను టాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారింది. దీంతో మంచు ల‌క్ష్మి లెస్బియ‌న్ యాక్ట్ కి సంబంధించిన ఫొటోల‌ని వైర‌ల్ చేస్తూ నెటిజ‌న్ లు మంచు ల‌క్ష్మిని ట్రోల్ చేస్తున్నారు. 'మాన్ స్ట‌ర్' లో లెస్బియ‌న్ యాక్ట్ గురించి త‌న‌న నెట్టింట‌ ట్రోల్ చేయ‌డంపై రీసెంట్ గా ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించిన మంచు ల‌క్ష్మి కావాల‌నే ఇలాంటి స్ట‌ఫ్ ని నెటిజ‌న్ ల‌కు తాను అందిస్తాన‌ని, ట్రోల‌ర్స్ కోస‌మే ఇలాంటి ప‌నులు చేస్తుంటాన‌ని, ట్రోల్స్ ని ఎంజాయ్ చేస్తుంటాన‌ని వెల్ల‌డించ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.