Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ మంచు హీరోయిన్ జాక్ పాట్

By:  Tupaki Desk   |   14 March 2021 8:20 AM GMT
ప్ర‌భాస్ స‌ర‌స‌న‌ మంచు హీరోయిన్ జాక్ పాట్
X
డార్లింగ్ ప్రభాస్ - పూజా హెగ్డే జంట‌గా న‌టించిన `రాధే శ్యామ్` జూలై 30 న విడుదల కానుంది. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ హైదరాబాద్ స‌హా ఐరోపాలో పూర్త‌యిన సంగ‌తి తెలిసిందే. పెండింగ్ ప‌నులు ముగించి జూలై తొలి వారానికి స‌ర్వం సిద్ధం చేయాల‌న్న‌ది ప్లాన్.

తాజా స‌మాచారం ప్ర‌కారం.. రాధేశ్యామ్ లో మాజీ మిస్ ఇండియా యూనివర్స్.. బాలీవుడ్ నటి సిమ్రాన్ కౌర్ ముండి కి అవ‌కాశం ద‌క్కింద‌ని తెలిసింది. రాధే శ్యామ్ కథ ప్రధానంగా సిమ్రాన్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఈ పాత్ర కోసం త‌న‌ను సంప్రదించార‌ని.. స్క్రిప్ట్ కూడా వినకుండా వెంటనే ఓకే చెప్పింద‌ని తెలిసింది.

2013 లో పోటుగాడు చిత్రంలో మంచు మనోజ్ స‌ర‌స‌న సిమ్ర‌న్ న‌టించింది. ఆ త‌ర్వాత ఇప్పటి వరకు ఏ తెలుగు సినిమాలోనూ నటించలేదు. తిరిగి ముంబైకి షిఫ్ట‌య్యింది. అక్క‌డ ప‌రిమిత బ‌డ్జెట్ చిత్రాలు స‌హా ఆల్ట్ బాలాజీ- హంగమా ప్లే - MX ప్లేయర్లలో పాపుల‌ర్ వెబ్ సిరీస్ ల‌లో న‌టించింది. పంజాబీ గాయకుడు-గురుదాస్ మన్ కుమారుడు గురిక్ మాన్ ను 2020 జనవరిలో వివాహం చేసుకున్నారు. మ‌ళ్లీ ఇప్పుడు సిమ్ర‌న్ ముండి క‌థానాయిక‌గా స‌త్తా చాటేందుకు ఉవ్విళ్లూరుతోంది.