Begin typing your search above and press return to search.

పిక్ టాక్: 'మంచు' సంక్రాంతి సంబరాలు..!

By:  Tupaki Desk   |   15 Jan 2021 7:16 AM GMT
పిక్ టాక్: మంచు సంక్రాంతి సంబరాలు..!
X
మంచు ఫ్యామిలీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రతి ఏటా పండుగ రోజున కుటుంబ సభ్యులంతా కలిసి శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల్లో జరిగే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ చేశారు. ముందుగా భోగి మంటలు వేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపిన మంచు ఫ్యామిలీ.. సంబరాలను జరుపుకున్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ క్రమంలో మంచు విరాణిక సంక్రాంతి సందర్భంగా తన ఫ్యామిలీతో దిగిన కొన్ని పిక్స్ అభిమానులతో పంచుకున్నారు.

ఇందులో మంచు విష్ణు తన సతీమణి విరానిక మరియు పిల్లలతో కలిసి ఉన్నారు. సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న అరియనా - వివియానా - అవరమ్ మంచు - ఐరా మంచు క్యూట్ ఫోటోలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఇంతకముందు మంచు విష్ణు - మనోజ్ సైతం సంక్రాంతి వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేశారు. మంచు మోహన్ బాబు ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని.. తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ.. వేడుకలు జరుపుకోవాలని పేర్కొన్నారు.