Begin typing your search above and press return to search.

మంచు నెక్ట్స్‌ జనరేషన్‌ ట్యాలెంట్‌ చూపించేందుకు రెడీ

By:  Tupaki Desk   |   9 May 2022 10:30 AM GMT
మంచు నెక్ట్స్‌ జనరేషన్‌ ట్యాలెంట్‌ చూపించేందుకు రెడీ
X
టాలీవుడ్ ప్రేక్షకులకు మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మంచు మోహన్‌ బాబు తో పాటు మంచు విష్ణు మరియు మంచు మనోజ్ లు కూడా హీరోలుగా ఇండస్ట్రీలో మంచి విజయాలను దక్కించుకున్నారు. మంచు లక్ష్మి కూడా మల్టీ ట్యాలెంటెడ్‌ అని నిరూపించుకుంది. ఇప్పుడు ఆ ఫ్యామిలీ నుండి మరో జనరేషన్‌ కిడ్స్ అరియానా మరియు వివియానా లు కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యారు.

డైనమిక్ స్టార్ విష్ణు మంచు హీరోగా నటిస్తున్న తాజా సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో 'గాలి నాగేశ్వరరావు' అనే మాస్ క్యారెక్టర్ చేస్తున్నారు విష్ణు.

ఈ క్యారెక్టర్ రివీల్ చేసినప్పట్నుంచి సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. పాయల్ రాజ్ ఫుత్, సన్నీలియోన్ వంటి తారలు యాడ్ అవ్వడం సినిమాకి స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.

ఇండియన్ మైకేల్ జాక్సన్ ప్రభుదేవా ఈ సినిమాలోని ఓ పాటకు కొరియోగ్రఫీ చేస్తుండటం ఈ సినిమాకి మరో హైలైట్. తాజాగా మరో స్పెషల్ అట్రాక్షన్ ఈ సినిమాకి యాడ్ అయ్యింది. అదేంటంటే... మంచు మోహన్ బాబు గారి మనవరాళ్లు.. విష్ణు మంచు కుమార్తెలు అయిన అరియానా.. వివియానా ఈ సినిమా ద్వారా సింగర్స్ గా పరిచయం అవుతున్నారు.

అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్న ఈ సినిమా లోని ఓ పాటను అరియానా, వివియానా పాడటం విశేషం. భాస్కరభట్ల ఈ పాటకి సాహిత్యం అందించారు. సినిమాకి కీలకంగా నిలిచే ఈ పాట ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఈ సినిమా విషయంలో విష్ణు మంచు తీసుకుంటున్న కేర్, సినిమాపై భారీ అంచనాలు నెలకొనేలా చేస్తున్నాయి.

మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో విష్ణు మంచు హీరోగా ఈషాన్ సూర్య దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి కథ, స్ర్కీప్లే తో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు కోన వెంకట్. డాషింగ్ సినిమాటోగ్రాఫర్ చోటా.కె.నాయుడు కెమెరా మ్యాన్ గా, భాను, నందు డైలాగ్స్ అందిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చుతున్నారు.