Begin typing your search above and press return to search.

సెప్టెంబ‌ర్ 3న మంచి రోజులు వచ్చాయి..?

By:  Tupaki Desk   |   13 Aug 2021 8:45 AM GMT
సెప్టెంబ‌ర్ 3న మంచి రోజులు వచ్చాయి..?
X
'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ - మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం ''మంచి రోజులు వచ్చాయి''. నిజజీవిత పాత్రల ఆధారంగా కంప్లీట్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. సెప్టెంబ‌ర్ 3న ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల తర్వాత థియేటర్లు తెరుచుకోవడంతో.. చిన్న సినిమాలన్నీ విడుదల అవుతున్నాయి. సినిమా బాగుంటే ఎలాంటి సందర్భంలో అయినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకంతో మేకర్స్ తమ చిత్రాలను థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఇదే సమయంలో కరోనా థర్డ్ వేవ్ వస్తే సెప్టెంబ‌ర్ లో మ‌ళ్లీ లాక్ డౌన్ పెట్టే అవ‌కాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రచారం జరుగుతున్నాయి. అందుకే ఆలోపు చిన్న, మ‌ధ్య త‌ర‌హా సినిమాలన్నీ రిలీజుల‌కి క్యూలు క‌డుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు 'మంచి రోజ‌లు వ‌చ్చాయి' చిత్రాన్ని సెప్టెంబ‌ర్ ఫస్ట్ వీక్ లో విడుదల చేయాలని చేస్తున్నారని తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

'మంచి రోజులు వచ్చాయి' చిత్రాన్ని UV కాన్సెప్ట్స్ - మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వి సెల్యులాయిడ్ మరియు SKN నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇందులో సంతోష్ శోభన్ - మెహ్రీన్ లతో పాటుగా.. అజయ్ ఘోష్ - వెన్నెల కిషోర్ - శ్రీనివాస్ రెడ్డి - ప్రవీణ్ - సప్తగిరి - సుదర్శన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు కనిపించనున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - క్యారక్టర్స్ ఇంట్రో లుక్ - ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్ లభించింది. మరి సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.