Begin typing your search above and press return to search.

పిక్ టాక్: ఏక్ మినీ హీరోతో మినీ స్కర్ట్ లో మెహ్రీన్..!

By:  Tupaki Desk   |   13 Oct 2021 1:30 PM GMT
పిక్ టాక్: ఏక్ మినీ హీరోతో మినీ స్కర్ట్ లో మెహ్రీన్..!
X
వినోదభరిత చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ''మంచి రోజులు వచ్చాయి''. ఇందులో సంతోష్ శోభన్ - మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో జరిగిన వాస్తవ సంఘటన ఆధారంగా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ని రూపొందిస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు - టీజర్ - పాటలు మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.

ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'మంచి రోజులు వచ్చాయి' చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. నవంబర్ 4వ తేదీన థియేట్రికల్ రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దసరా కానుకగా రేపు (అక్టోబర్ 14) గురువారం ఉదయం 9 గంటలకు ఈ ట్రైలర్ ను విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది.

ఈ సందర్భంగా 'మంచి రోజులు వచ్చాయి' చిత్రం నుంచి హీరోహీరోయిన్లకు సంబంధించి సరికొత్త పోస్టర్ ని సోషల్ మీడియాలో వదిలారు. ఇందులో సంతోష్ ఫార్మల్ డ్రెస్ లో నీట్ గా టక్ చేసుకొని మెహ్రీన్ ని చూస్తూ నవ్వుతున్నాడు. రెడ్ కలర్ టాప్ - మినీ స్కర్ట్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయినట్లు ఇటీవల వచ్చిన సాంగ్స్ ని బట్టి తెలుస్తోంది.

'ఏక్ మినీ కథ' సినిమాతో సక్సెస్ అందుకున్న సంతోష్ శోభన్ - 'ఎఫ్ 3' బ్యూటీ మెహ్రీన్ కలిసి చేస్తున్న 'మంచి రోజులు వచ్చాయి' సినిమా వారికి మంచి విజయాన్ని అందిస్తుందో చూడాలి. యూవీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. వి సెల్యులాయిడ్ - SKN ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. రామ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్ - వెన్నెల కిషోర్ - శ్రీనివాస్ రెడ్డి - ప్రవీణ్ - సప్తగిరి - సుదర్శన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.