Begin typing your search above and press return to search.

పెయిడ్ ప్రీమియర్స్‌ తో సంచలనం రేపుతున్న 'మంచి రోజులు వచ్చాయి'..!

By:  Tupaki Desk   |   3 Nov 2021 11:30 AM GMT
పెయిడ్ ప్రీమియర్స్‌ తో సంచలనం రేపుతున్న మంచి రోజులు వచ్చాయి..!
X
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో యువీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంయుక్తంగా రూపొందించిన తాజా చిత్రం ''మంచి రోజులు వచ్చాయి''. ఇందులో 'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ - గ్లామర్ డాల్ మెహ్రీన్ కౌర్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై బజ్ క్రియేట్ చేసింది. దీపావళి సందర్భంగా రేపు నవంబరు 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే ఈరోజు రాత్రి 8.30 గంటలకు తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో పెయిడ్ ప్రీమియర్స్ ను ప్రదర్శించబోతున్నారు.

వైజాగ్ - ఏలూరు - రాజమండ్రి - విజయవాడ - గుంటూరు - తిరుపతి - నెల్లూరు తదితర నగరాల్లో ఈరోజు రాత్రి ''మంచి రోజులు వచ్చాయి'' మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ఏర్పాటు చేశారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ డిమాండ్ మేరకు భీమవరంలో కూడా స్పెషల్ ప్రీమియర్ షో వేస్తున్నారు. ఆశ్చర్యంగా ఈ స్పెషల్ ప్రీమియర్ షో బుకింగ్ ఓపెన్ అయిన వెంటనే టికెట్స్ అన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. హైదరాబాద్ - కడప లలో కూడా ఎక్స్ ట్రా షోలు వేస్తున్నారని తెలుస్తోంది.

మొత్తం 15 చోట్ల 'మంచి రోజులు వచ్చాయి' ప్రీమియర్స్ ఏర్పాటు చేయగా.. అన్ని చోట్లా హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. హైదరాబాద్ ఐమాక్స్ థియేటర్‌ లో స్క్రీన్స్ పెంచే అవకాశం కనిపిస్తోంది. కేవలం ప్రీమియర్స్‌ తోనే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. రేపు దీపావళి పండుగ సందర్భాన్ని పురస్కరించుకుని జనాలు థియేటర్లకు రావడానికి ఇష్టపడతారు కాబట్టి.. ఓపెనింగ్స్ కూడా భారీగా ఉంటాయని మేకర్స్ భావిస్తున్నారు.

కాగా, 'మంచి రోజులు వచ్చాయి' సినిమా మారుతి గత చిత్రాల తరహాలో సందేశం మరియు వినోదం - రొమాన్స్ కలిపి రెడీ చేశారు. వి సెల్యులాయిడ్ - SKN సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా.. సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు. ఈ చిత్రంలో అజయ్ ఘోష్ - వెన్నెల కిషోర్ - సప్తగిరి - సుదర్శన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - శ్రీకాంత్ అయ్యంగార్ - రంజిత తదితరులు నటించారు. ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్‌ కు మంచి స్పందన రావడం.. పెయిడ్ ప్రీమియర్స్ హౌజ్ ఫుల్ అవుతుండటం 'మంచి రోజులు వచ్చాయి' చిత్రానికి శుభ పరిణామం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ సినిమా యూనిట్ కు బెస్ట్ విషెస్ అందిస్తూ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. మరి వరుస విజయాలతో దూసుకుపోతున్న మారుతి ఈ దీపావళికి ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.