Begin typing your search above and press return to search.

ప్రీమియర్స్ తో ముందుగానే నవ్వులు పూయించనున్న 'మంచి రోజులు వచ్చాయి

By:  Tupaki Desk   |   30 Oct 2021 2:25 PM GMT
ప్రీమియర్స్ తో ముందుగానే నవ్వులు పూయించనున్న మంచి రోజులు వచ్చాయి
X
'ప్రతి రోజూ పండగే' వంటి సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ మారుతి తెరకెక్కించిన సినిమా ''మంచి రోజులు వచ్చాయి''. ఇందులో ‘ఏక్ మినీ కథ’ హీరో సంతోష్ శోభన్ - గ్లామర్ డాల్ మెహ్రీన్ కౌర్ జంటగా నటించారు. మారుతి మార్క్ రొమాన్స్ తో పాటు బోలెడంత కామెడీని కలబోసి ఈ చిత్రాన్ని రూపొందించారు. దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేదీన ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే అంతకంటే ముందుగానే థియేటర్లలో నవ్వులు పంచడానికి మేకర్స్ ప్లాన్ చేశారు.

''మంచి రోజులు వచ్చాయి'' సినిమా ప్రీమియర్స్ ను తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాల్లో నవంబర్ 3వ తేదీ రాత్రి 8.30 గంటలకు ప్రదర్శించబోతున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రసాద్స్ (హైదరాబాద్) - పీజీఆర్ సినిమాస్ (తిరుపతి) - M1 సినిమాస్ (నెల్లూరు) - ఏలూరు అంబికా కాంప్లెక్స్ (వెస్ట్ గోదావరి) - రాజమండ్రి అనుశ్రీ సినిమాస్ (ఈస్ట్ గోదావరి) - వి ప్లాటినో సినిమాస్ (గుంటూరు) - మెలోడీ (వైజాగ్) - రాజ్ యువరాజ్ (విజయవాడ) వంటి థియేటర్లలో ఈ సినిమా ప్రీమియర్స్ షోలు ప్రదర్శిస్తారు. దీనికి సంబంధించిన బుకింగ్స్ రేపు ఆదివారం ఉదయం ఓపెన్ అవుతాయని మేకర్స్ పేర్కొన్నారు.

'మంచి రోజులు..' సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన టీజర్లు పాటలు యూత్ కు బాగా కనెక్ట్ అయ్యాయి. అలానే ఇటీవల నిర్వహించిన గ్రాండ్ ప్రీ రిలీజ్ వేడుకతో మూవీపై బజ్ క్రియేట్ అయింది. ఈ క్రమంలో వచ్చిన రెండు ట్రైలర్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకొని, సినిమాపై అంచనాలు పెంచేశాయి. ఇది మారుతి తరహా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో అజయ్ ఘోష్ - వెన్నెల కిషోర్ - సప్తగిరి - సుదర్శన్ - వైవా హర్ష - సత్యం రాజేష్ - శ్రీకాంత్ అయ్యంగార్ - రంజిత వంటి భారీ తారాగణం నటించారు.

యూవీ కాన్సెప్ట్స్ మరియు మాస్ మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా 'మంచి రోజులు వచ్చాయి' చిత్రాన్ని నిర్మించాయి. వి సెల్యులాయిడ్ - SKN దీనికి నిర్మాతలుగా వ్యవహరించారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా.. శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందించారు.