Begin typing your search above and press return to search.
శ్రావణి ఆత్మహత్య: సంచలన విషయాలు బయటపెట్టిన సాయి
By: Tupaki Desk | 9 Sept 2020 11:01 PM ISTసినీ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో ట్విస్ట్ ల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. శ్రావణి ఆత్మహత్య కేసులో సాయి అనే వ్యక్తి కారణమని తాజాగా శ్రావణి స్నేహితుడు దేవరాజ్ రెడ్డి విడుదల చేసిన వీడియోలో ఆరోపించాడు. దీంతో సాయినే కారకుడని అందరూ భావించారు. కానీ ఇప్పుడు సాయి బయటకు వచ్చాడు.
సాయి అనే వ్యక్తియే కొట్టి హింసించేవాడని.. అతడి వేధింపుల వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని తాజాగా శ్రావణి స్నేహితుడు దేవరాజ్ రెడ్డి చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 7న తాను, శ్రావణి కలిసి డిన్నర్ కు వెళ్లామని.. అక్కడ సాయి అనే వ్యక్తి వచ్చి శ్రావణిపై చేయి చేసుకున్నాడని దేవరాజ్ రెడ్డి వివరించారు.
శ్రావణికి ఐదేళ్లుగా సాయితో పరిచయం ఉందని.. తాను సంవత్సరం క్రితం శ్రావణికి స్నేహితుడను అయ్యానని దేవరాజ్ రెడ్డి తెలిపారు. సాయి వల్లే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని ఆరోపించాడు.
తాజాగా సాయి అనే వ్యక్తి బయటకు వచ్చి సంచలన విషయాలు బయటపెట్టాడు. దేవరాజు రెడ్డి విడుదల చేసిన ఈ వీడియో అవాస్తవమని సాయి కొట్టిపారేశాడు. తాను శ్రావణి ఫ్యామిలీకి స్నేహితుడని.. శ్రావణి చనిపోయినప్పటి నుంచి మృతదేహంతోనే ఉన్నానని తెలిపాడు. తాను ఎక్కడికి పారిపోలేదని.. పోలీసులతోనే ఉన్నానని సాయి వెల్లడించాడు.