Begin typing your search above and press return to search.

పవన్-హరీష్ సినిమా హీరోయిన్ ఈమేనా?

By:  Tupaki Desk   |   12 May 2020 4:00 PM IST
పవన్-హరీష్ సినిమా హీరోయిన్ ఈమేనా?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘పింక్’ రీమేక్ ‘వకీల్ సాబ్’ సినిమాతో రీఎంట్రీ ఇస్తున్నాడు. దీని తర్వాత క్రిష్ దర్శకత్వంలో ఓ పీరియడ్ ఫిలిం చేస్తున్నాడు. ఐతే అభిమానులు మాత్రం వీటి కంటే తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమా విషయంలోనే ఎక్కువ ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. ఆ కాంబినేషన్‌కు ఉన్న క్రేజ్ అలాంటిది మరి. ‘గబ్బర్ సింగ్’తో ఈ జోడీ ఎనిమిదేళ్ల కిందట బాక్సాఫీస్‌ను ఎలా షేక్ చేసిందో తెలిసిందే. నిన్న ‘గబ్బర్ సింగ్’ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని.. పవన్‌తో తాను చేయబోయే కొత్త చిత్రానికి దేవిశ్రీ ప్రసాదే సంగీతం అందించబోతున్నట్లు ఓ ఎగ్జైటింగ్ అప్‌డేట్ ఇచ్చాడు హరీష్. కాగా ఈ సినిమాలో కథానాయిక గురించి ఇప్పుడో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ఓ కొత్తమ్మాయిని తెలుగు తెరకు పరిచయం చేయబోతున్నాడట హరీష్.

మలయాళ అమ్మాయి మానస రాధాకృష్ణన్.. హరీష్ శంకర్ సినిమాలో పవన్‌తో జోడీ కట్టబోతోందట. ఈ అమ్మాయి వయసు 21 ఏళ్లే. చైల్డ్ ఆర్టిస్టుగా కొన్ని సినిమాలు చేసింది. స్కూలింగ్ తర్వాత దుబాయికి వెళ్లి కొన్నేళ్లు చదువుకుని తిరిగొచ్చింది. తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. కథానాయికగానే కాక క్యారెక్టర్ రోల్స్‌లో ఎనిమిది సినిమాలు చేసింది. ఆమె చేసినవన్నీ చిన్న, మీడియం రేంజ్ సినిమాలే. కథానాయికగా ఆమెకు పెద్ద స్థాయి ఏమీ లేదు. కానీ చూడ్డానికి చాలా అందంగా, క్యూట్‌గా కనిపిస్తోంది. ట్రెడిషనల్ క్యారెక్టర్లకు బాగా సూటయ్యేలా ఉంది. ఐతే పవన్ సినిమాలో ఈమె నటిస్తున్నట్లు ఎవరు హింట్ ఇచ్చారో ఏమో కానీ.. పవన్ ఫ్యాన్స్ మాత్రం ఈమె గురించి తెగ వెతికేస్తున్నారు. ట్విట్టర్లో తన ఫొటోలు తెగ షేర్ చేస్తున్నారు. మరి పీఎస్పీకే 28 హీరోయిన్ గురించి అధికారిక ప్రకటన ఎప్పుడొస్తుందో చూడాలి.