Begin typing your search above and press return to search.

మానస ఎంట్రీ నిజమే కాని పవన్‌ తో కాదు

By:  Tupaki Desk   |   16 July 2021 4:00 PM IST
మానస ఎంట్రీ నిజమే కాని పవన్‌ తో కాదు
X
మలయాళంలో చిన్న చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకున్న మానస రాధాకృష్ణ్‌ టాలీవుడ్ లో బిజీ అవ్వబోతుంది అంటూ గత కొన్ని రోజులుగా మీడియాలో వార్తలు తెగ హడావుడి చేస్తున్నాయి. తెలుగులో ఈమె ఎంట్రీ చాలా గ్రాండ్ గా ఉండబోతుంది అనేది ఆ వార్తల సారాంశం. పవన్ కళ్యాణ్‌ హీరోగా హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా లో ఈమె హీరోయిన్‌ గా కన్ఫర్మ్‌ అయినట్లుగా కొన్ని మెయిన్‌ స్ట్రీమ్‌ మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేశాయి. దాంతో పవన్‌ తో దక్కించుకున్న ఆ ముద్దుగుమ్మ ఎవరా అంటూ చాలా మంది ఆమె బయో కోసం నెట్టింట సెర్చ్ చేయడం మొదలు పెట్టారు.

పవన్‌ మూవీలో మానస అంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఆమె వైపు అంతా చూశారు. పేరు మానస అనగానే తెలుగు అమ్మాయిలా అనిపించింది. మొదట ఈమెను అంతా తెలుగు అమ్మాయి అనుకున్నారు. కాని ఈమె తెలుగు అమ్మాయి కాదు మలయాళి ముద్దుగుమ్మ అని తెలిసిన తర్వాత అయినా కూడా పవన్‌ తో ఆఫర్‌ దక్కించుకున్న ఈ అమ్మడు టాలీవుడ్‌ లో కాబోయే స్టార్‌ హీరోయిన్‌ అంటూ కొందరు కామెంట్స్ చేశారు.

నెట్టింట ఈమె చేసిన సందడికి హరీష్‌ శంకర్‌ ప్రకటన బ్రేక్‌ వేసినట్లు అయ్యింది. దర్శకుడు హరీష్‌ శంకర్ తాము ఇంకా హీరోయిన్‌ విషయంలో తుది నిర్ణయం తీసుకోలేదు అన్నారు. దాంతో మానస గురించిన వార్తలు ఒక్కసారిగా సైలెంట్ అయ్యాయి. కాని అనూహ్యంగా మళ్లీ ఆఫర్‌ దక్కించుకుంది. అయితే ఈసారి పవన్‌ కళ్యాణ్‌ తో కాకుండా జూనియర్‌ రౌడీ స్టార్‌ తో అంటూ అధికారికంగా క్లారిటీ వచ్చింది.

గుహన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న హైవే సినిమాలో ఈమె ఆనంద్ దేవరకొండ కు జోడీగా నటిస్తుంది. ఇటీవల షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఆనంద్ తో అప్పుడే ఈమె జాయిన్‌ అయ్యింది. ఈ మలయాళి ముద్దుగుమ్మ పవన్‌ తో అవకాశం దక్కించుకోలేకున్నా కూడా టాలీవుడ్‌ లో మాత్రం ఎంట్రీ నిజమే అని తేలిపోయింది. టాలీవుడ్‌ లో మొదటి సినిమా తో ఈమె సక్సెస్‌ దక్కించుకుంటే ఒక్కటి రెండేళ్లలో ఈమె టాప్ స్టార్‌ గా గుర్తింపు దక్కించుకునే అవకాశం ఉంది అంటున్నారు. విభిన్న చిత్రాల దర్శకుడిగా పేరు దక్కించుకున్న గుహన్‌ దర్శకత్వంలో సినిమా అంటే ఖచ్చితంగా మంచి పేరు దక్కించుకోవడం ఖాయం. కనుక మొదటి సినిమా పై ఈమె ఆశలు పెట్టుకుంది.

మలయాళ ఇండస్ట్రీతో పోల్చితే టాలీవుడ్‌ లో మంచి ఆఫర్లు ఉంటాయి. అలాగే పారితోషికం విషయంలో కూడా రెండు మూడు రెట్లు అధికంగా ఉంటుంది. కనుక మానస ముందు ముందు టాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇక ఆనంద్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ నాల్గవ సినిమా అయిన హైవే స్పీడ్ గా చిత్రీకరణ పూర్తి చేసి ఇదే ఏడాదిలో విడుదల చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారట. మరో వైపు ఆయన నటించిన పుష్పక విమానం కూడా విడుదలకు సిద్దంగా ఉన్న విషయం తెల్సిందే.

మానస హీరోయిన్ తెలుగు లో మొదటి సినిమా విడుదల కాకుండానే రెండవ సినిమా కూడా దక్కించుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఈమెతో కొందరు మేకర్స్‌ చర్చలు జరుపుతున్నారట. వచ్చిన ప్రతి ఆఫర్‌ ను ఓకే చేయకుండా కాస్త జాగ్రత్తగా కెరీర్‌ ను ప్లాన్ చేసుకుంటే మానసకు టాలీవుడ్‌ లో మంచి భవిష్యత్తు ఉంటుందని అంటున్నారు. మరి మానస ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.