Begin typing your search above and press return to search.

బిగ్‌బాస్‌ః ఎట్టకేలకు కెప్టెన్‌ అయ్యాడు

By:  Tupaki Desk   |   19 Nov 2021 7:39 AM GMT
బిగ్‌బాస్‌ః ఎట్టకేలకు కెప్టెన్‌ అయ్యాడు
X
తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 5 క్లైమాక్స్ దశకు చేరుకుంది. 12వ వారంలో అడుగు పెట్టబోతున్న నేపథ్యంలో మరింత రసవత్తరంగా గేమ్ ఉండబోతుందని అభిమానులు నమ్మకంతో ఉన్నారు. బిగ్‌ బాస్ సీజన్ 5 లో ఇప్పటి వరకు మానస్ కెప్టెన్ అవ్వలేదు. అతడు పలు కెప్టెన్సీ టాస్క్ ల్లో బెస్ట్ ఇచ్చినా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో చివరకు కెప్టెన్సీని చేజార్చుకుంటూ వచ్చాడు.

ఎట్టకేలకు బంగారు వేట టాస్క్‌ లో నెగ్గి కెప్టెన్సీ టాస్క్ లో కూడా విజయాన్ని సొంతం చేసుకుని ఇంటి 11వ కెప్టెన్ గా నిలిచాడు. ప్రస్తుతం ఇంట్లో ఉన్న వారిలో ప్రియాంక.. కాజల్‌ మరియు మానస్ తప్ప అందరు కూడా కెప్టెన్‌ లుగా చేశారు. ఇప్పుడు మానస్‌ కూడా కెప్టెన్ అయ్యాడు. నేడు ప్రసారం అవ్వబోతున్న ఎపిసోడ్‌ లో మానస్ కు కెప్టెన్సీ బ్యాండ్‌ రాబోతుంది. ముందుగానే లీక్ అయిన దాని ప్రకారం మానస్ ఈ వారం కెప్టెన్సీ టాస్క్ విన్నర్ అని తెలుస్తోంది.

సన్నీ మరియు మానస్ ల స్నేహం కు చాలా మంది అభిమానులు ఉన్నారు. గత సీజన్ లో మెహబూబ్‌ మరియు సోహెల్ మాదిరిగా ఈ సీజన్ లో కూడా వీరిది మంచి స్నేహం అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. వీరిద్దరు కూడా గేమ్‌ లో తమ బెస్ట్‌ ఇస్తూ టాస్క్ ల్లో చక్కని ప్రతిభ కనబర్చుతున్నారు.

అలాగే తాము అనుకున్న విషయాన్ని నిర్మొహమాటంగా మాట్లాడుతూ అందరి అభిమానంను దక్కించుకున్నారు. ఎట్టకేలకు కెప్టెన్ గా మానస్ నిలవడంతో వచ్చే వారం అతడికి ఇమ్యూనిటీ లభిస్తుంది. అంటే అతడు ఇంకా రెండు వారాల పాటు అందే చివరి వారంకు ముందు వరకు ఉండబోతున్నాడు.

మానస్ కు పెద్దగా క్రేజ్ లేదు.. అతడు నాలుగు అయిదు వారాల్లోనే బయటకు వస్తాడని కొందరు అనుకున్నారు. కాని అక్కడ హుందాగా ప్రవర్తించడం.. గేమ్స్ లో ది బెస్ట్ ఇవ్వడంతో పాటు అక్కడి వారితో చక్కని రిలేషన్‌ ను మెయింటెన్‌ చేయడం వల్ల ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది.

అదే మానస్ కు కలిసి వచ్చింది. పైగా అతడు ట్రాన్స్ జెండర్‌ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక సింగ్‌ తో చాలా సన్నిహితంగా మెలగడం.. ఆమె పట్ల ప్రేమను కనబర్చుతూ స్నేహంగా ఉండటం వల్ల కూడా అతడు ఇన్ని రోజులు సేవ్‌ అయ్యేలా చేసింది అనడంలో సందేహం లేదు. టాప్ 5 కి మానస్ అర్హుడు అంటూ అభిమానులు నమ్మకంగా చెబుతున్నారు.