Begin typing your search above and press return to search.

యేలేటి సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది

By:  Tupaki Desk   |   16 July 2016 3:41 PM GMT
యేలేటి సినిమా రిలీజ్ డేట్ వ‌చ్చేసింది
X
టాలీవుడ్లోని అత్యంత విలక్షణమైన దర్శకుల్లో చంద్రశేఖర్ యేలేటి ఒకడు. ఐతే.. అనుకోకుండా ఒకరోజు.. ఒక్కడున్నాడు.. ప్రయాణం.. సాహసం.. ఈ సినిమాలే చెప్పేస్తాయి యేలేటి అంటే ఏంటో. సాహ‌సం త‌ర్వాత దాదాపు మూడేళ్లు విరామం తీసుకుని యేలేటి రూపొందించిన సినిమా మ‌న‌మంతా. ఇందులో మోహన్ లాల్ లాంటి గ్రేట్ యాక్టర్ ముఖ్య పాత్ర పోషించ‌డం.. గౌతమి కూడా చాన్నాళ్ల త‌ర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తూ ఈ సినిమాలో న‌టించ‌డంతో మ‌న‌మంతా మీద ఆస‌క్తి మ‌రింత పెరిగింది. దీనికి తోడు ఆ మ‌ధ్య రిలీజైన టీజ‌ర్ కూడా ఆక‌ట్టుకుంది. ఈ ఇంట్ర‌స్టింగ్ మూవీ రిలీజ్ డేట్ ఖ‌రారైపోయింది.

ఆగ‌స్టు 5న మ‌న‌మంతా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. జులై 29న జ‌క్క‌న్న‌.. పెళ్లి చూపులు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోగా.. ఆగ‌స్టు 12న బాబు బంగారం.. 13న తిక్క రాబోతున్నాయి. మ‌ధ్య‌లో ఖాళీ దొరికిన శుక్ర‌వారాన్ని యేలేటి సినిమాకు వాడేసుకుంటున్నారు.వారాహి చలనచిత్రం’ బేనర్ మీద సాయి కొర్రపాటి నిర్మిస్తున్న ఈ చిత్రంలో కేరింత ఫేమ్ విశ్వాంత్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్నాడు. నలుగురు వేర్వేరు వ్యక్తుల జీవితాల్ని చూపించి.. ఆ నలుగురికీ ముడిపెట్టి కథను నడిపించబోతున్నాడు యేలేటి. ఇది మ‌ల్టీ స్టోరీ స్క్రీన్ ప్లేతో సాగే సినిమా.