Begin typing your search above and press return to search.

వంశీ హీరోయిన్ తో నందమూరి ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   31 May 2017 5:51 PM GMT
వంశీ హీరోయిన్ తో నందమూరి ఎమ్మెల్యే
X
దర్శకుడు వంశీ సినిమాల్లో నటించేందుకు హీరోయిన్స్ తెగ ఆసక్తి చూపిస్తుంటారు. అందాల భామలను అద్భుతంగా చూపించే ఆయన ప్రతిభే ఇందుకు కారణంగా చెప్పచ్చు. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ మూవీలో ముగ్గురు హీరోయిన్స్ ఉండగా.. వీరిలో మనాలి రాధోడ్ కూడా ఉంది.

ఇంకా ఫ్యాషన్ డిజైనర్ రిలీజ్ కాకముందే అప్పుడే మనాలికి ఓ అద్భుతమైన ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. వంశీ మూవీలో ఈ భామ లుక్స్ చూసి తెగ ఇంప్రెస్ అయ్యాడట నందమూరి కళ్యాణ్ రామ్ తో మూవీ తీయనున్న కొత్త దర్శకుడు ఉపేంద్ర మాధవ్. ఎమ్మెల్యే అనే టైటిల్ పై రూపొందించనున్న చిత్రం కోసం మనాలి రాథోడ్ ను అప్రోచ్ అవడం.. ఆ భామ సై అనడం జరిగిపోయాయని అంటున్నారు. అయితే.. ఈ మూవీలో మనాలి మెయిన్ హీరోయిన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే.. ఈ ఎమ్మెల్యే కోసం ఇప్పటికే టాప్ బ్యూటీ కాజల్ అగర్వాల్ తో సంప్రదింపులు జరిగాయి.

తన తొలి హీరోతో మరోసారి జట్టు కట్టేందుకు కాజల్ కూడా ఓకే చెప్పేసింది. సో.. ఎమ్మెల్యే మూవీలో మనాలి రాధోడ్ ఓ కీలక పాత్రను దక్కించుకుని ఉండొచ్చు. అయితే.. యాక్షన్ కామెడీ జోనర్ లో రూపొందుతున్న ఈ మూవీలో మనాలి రాథోడ్ కనిపించడం అయితే ఖాయమే అంటున్నారు. ఇక ఫ్యాషన్ డిజైనర్ మూవీ రిలీజ్ అయ్యాక.. అందరి కంటే ఎక్కువగా ఈ భామకే ప్లస్ అవుతుందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.