Begin typing your search above and press return to search.

ఈ రవివర్మ చిత్రం ఏమవుద్దో!!

By:  Tupaki Desk   |   26 May 2017 6:44 AM GMT
ఈ రవివర్మ చిత్రం ఏమవుద్దో!!
X
ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ ఈ పేరు చదవగానే మీకు గుర్తుకు వచ్చే ఒకే శబ్ధం ‘వంశీ’. తెలుగు కలల చిత్రకారుడు వంశీ సినిమా జూన్ 2 న విడుదల అవుతుంది. వంశీ పాటలు మిగతా వాళ్ళ పాటలు లాగా డాన్సులు ఎక్కువ ఉండవు అలాగే భారీ సెట్లు ఉండవు. కానీ ఒక రాకుమారి కలల ప్రపంచం, మరో ప్రేమ జంట ఊహ లోకం లోకి ప్రేక్షకులును తీసుకువెళ్ళి మాయ చేస్తారు.

ఇప్పుడు వస్తున్న వంశీ ఫ్యాషన్ డిజైనర్ s/o లేడీస్ టైలర్ లో హీరోయిన్ గా చేసిన మనాలి రాథోడ్ అలాంటి మాయలోనే ఉన్నాను అంటోంది. ఈ సినిమాలో మనాలి రాథోడ్ అమ్ములుగా కనిపించబోతుంది. ఇకపోతే ‘రవివర్మ చిత్రమా’ అనే పాటలో అమ్ముడు వంశీ ప్రపంచంలో చిందులు వేసింది. ఇదే విషయం చెప్పి మనాలి తెగ సంబరపడుతోంది. కాదా మరీ.. వంశీ పాటకు ఉన్న క్రేజ్ అలాంటిది. వంశీ పాటలు తోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ వచ్చిన తారలు చాలామంది ఉన్నారు. భానుప్రియ మొదటి సినిమా సితారా వంశీ డైరెక్ట్ చేశారు. ఆ సినిమాతో భానుప్రియ హీరోయిన్ అయ్యింది అనే చెప్పుకోవచ్చు. ఇదంతా ఓకె కాని.. ఈ సినిమాతో మనాలి ఎలా ఫీలైపోతుందో తెలుసా?

నిజానికి ఒక వార్తపత్రిక మనాలి గురించి ఒక ఆర్టికల్ వేసి.. ఆమె ఆర్టికల్ క్రింద ఒక స్టార్ హీరోయిన్ గురించిన మ్యాటర్ పబ్లిష్‌ చేసిందట. అది చూసుకున్న మనాలి.. అబ్బా ఆ స్టార్ హీరోయిన్ కంటే నేను పైన ఉన్నాను అనే ఫీలింగే ఏదోలా ఉంది అంటోంది. పేపర్ లో వార్తది ఏముందిలే బేబి.. ఇవాళ పేపర్ రేపటికి వేస్ట్ అయిపోతుంది. కాబట్టి అలాంటి పొజిషన్ నిజంగా ఎచీవ్ చేస్తే అది న్యూస్ అవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/