Begin typing your search above and press return to search.

స్టార్ హీరో ఇమేజ్ చెడగొడుతున్న మేనేజర్

By:  Tupaki Desk   |   26 Sep 2019 11:15 AM GMT
స్టార్ హీరో ఇమేజ్ చెడగొడుతున్న మేనేజర్
X
స్టార్ హీరోలకు మేనేజర్లు ఉండడం చాలా సాధారణ విషయమే. అయితే మేనేజర్ కనుక సరిగా లేకపోతే ఏకంగా స్టార్ హీరోకే చెడ్డపేరు రావడం ఖాయం. ప్రస్తుతం ఒక స్టార్ హీరో విషయం లో అలాగే జరుగుతోందని ఇన్సైడ్ టాక్. ఆ హీరో టాలీవుడ్ టాప్ స్టార్ హీరోల్లో ఒకరు. భారీ ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్ ఉంది. హీరోకు నిజానికి సౌమ్యుడనే పేరు ఉంది కానీ తన మేనేజర్ వల్ల హీరోకి చెడ్డపేరు వస్తోందట. హీరోకు మాత్రమే కాదు.. హీరో ఫ్యామిలీ అంతటికీ బ్యాడ్ నేమ్ వస్తోందని అంటున్నారు.

ఈ స్టార్ హీరో సినిమాలతో బిజీగా ఉండడంతో పాటుగా నిర్మాతగా కూడా తన సత్తా చాటుతున్నాడు. అయితే ఎంతో బిజీగా ఉండే వ్యక్తి కావడంతో కాస్త ఎక్కువగా మేనేజర్ పై ఆధారపడుతున్నాడట. దీంతో ఆ మేనేజర్ తన సొంత పైత్యాన్ని చూపిస్తున్నాడని అంటున్నారు. హీరో అపాయింట్ మెంట్స్ ఉన్న సమయంలో వాటిని వీలైనంత డిలే చేస్తూ ఇండస్ట్రీలో ఆ హీరోకున్న మంచి పేరును మేనేజర్ చెడగొడుతున్నాడట. అంతే కాదు.. ఈ మేనేజర్ సూచనలతోనే సదరు స్టార్ హీరో మీడియాను దూరంగా ఉంచడం లాంటివి చేస్తున్నారట. వీటి వల్ల తన ఇమేజ్ దెబ్బ తింటోందనే విషయం ఇంకా హీరో దృష్టికి వచ్చిందో లేదో తెలీదు కానీ ఆలోపు జరగాల్సిన డ్యామేజ్ జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. ఎప్పుడూ డౌన్ టు ఎర్త్.. సింపుల్ ఉండే స్టార్ హీరో కూడా ఈ పర్సనల్ మేనేజర్ సూచనలతో 'స్టార్' లా ప్రవర్తించడం మొదలుపెట్టాడని అంటున్నారు.

ఈ మేనేజర్ ను కనుక దూరం పెట్టకపోతే ఆ స్టార్ హీరో ఇమేజికి డ్యామేజ్ తప్పదని ఇండస్ట్రీలో ఉన్న ఆ బడా ఫ్యామిలీ శ్రేయోభిలాషులు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒక స్టార్ హీరోకు మేనేజర్ గా ఉండడం అనేది పెద్ద బాధ్యత మాత్రమే కాదు గౌరవం కూడా.. ఇండస్ట్రీ లో మేనేజర్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. కానీ ఇలాంటి ఒకరిద్దరి వల్ల మేనేజర్లకు కామన్ గా చెడ్డపేరు రావడం బాధాకరం.