Begin typing your search above and press return to search.

ప్రముఖ సింగర్‌ పేరుతో లక్షల మోసం

By:  Tupaki Desk   |   30 May 2019 5:08 PM IST
ప్రముఖ సింగర్‌ పేరుతో లక్షల మోసం
X
టెక్నాలజీ పెరిగిన నేపథ్యంలో మోసగాళ్లు కూడా విపరీతంగా పెరిగి పోతున్నారు. పెరిగిన టెక్నాలజీని ఉపయోగించుకుని మోసాలకు పాల్పడటం జరుగుతుంది. ఇక సెలబ్రెటీల పేర్లు పెట్టుకుని.. వారి పేర్లను ఉపయోగించుకుని అమాయకులను మోసం చేయడం ఇప్పటి వరకు చాలా సార్లు చూశాం. తాజాగా మరోసారి అలాంటి సంఘటన పునరావృతం అయ్యింది. బాలీవుడ్‌ కు చెందిన యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ సింగర్‌ ఆర్మాన్‌ మాలిక్‌ పేరుతో ఒక నకిలీ సోషల్‌ మీడియా అకౌంట్‌ ను క్రియేట్‌ చేసి ఆడవాళ్లను మహేంద్ర వర్మన్‌ చీటింగ్‌ చేశాడు.

తమిళనాడు విల్లుపురం జిల్లా ఉలుందూరుపేటకు చెందిన మహేంద్ర వర్మన్‌ ఈజీ మనీ కోసం ఆర్మాన్‌ పేరుతో సోషల్‌ మీడియా అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. ఆ అకౌంట్‌ ద్వారా అమ్మాయిలను ఆకర్షించడం మొదలు పెట్టాడు. ఆర్మాన్‌ అన్నట్లుగా నమ్మే విధంగా మాట్లాడటం.. పోస్ట్‌ లు పెట్టడం చేశాడు. దాంతో చాలా మంది ఆయన నిజమైన ఆర్మన్‌ అని నమ్మారు. ఆ సమయంలోనే అతన వక్రబుద్దిని ప్రదర్శించి వారి నుండి న్యూడ్‌ ఫొటోలు.. హాట్‌ ఫొటోలను సంపాదించాడు.

ఫొటోలు వచ్చిన తర్వాత మహేంద్ర తన అసలు స్వరూపం చూపిస్తాడు. న్యూడ్‌ ఫొటోలను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అంటూ పలువురు మహిళల నుండి లక్షల్లో డబ్బును వసూళ్లు చేశాడు. తాజాగా ఒక యువతి ఇతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. పోలీసులు అరెస్ట్‌ చేసి ఎంక్వౌరీ చేయగా చాలా మందిని బ్లాక్‌ మెయిల్‌ చేసినట్లుగా ఒప్పుకున్నాడు. మహేంద్రను అరెస్ట్‌ చేసి పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈజీ మనీ కోసం తాను ఈ పని చేసినట్లుగా అతడు చెప్పుకొచ్చాడు.