Begin typing your search above and press return to search.

అక్కినేని హీరో కోసం రంగంలోకి మెగాస్టార్‌

By:  Tupaki Desk   |   7 March 2022 8:57 AM GMT
అక్కినేని హీరో కోసం రంగంలోకి మెగాస్టార్‌
X
`మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్` మూవీతో అఖిల్ అక్కినేని ట్రాక్ లోకి వ‌చ్చేశారు. చాలా కాలంగా స‌రైన హిట్ కోసం ఎదురుచూసిన అఖిల్ కు ఈ మూవీ మంచి విజ‌యాన్ని అందించింది. ఈ స‌క్సెస్ అందించిన‌ జోష్ తో అఖిల్ ఏకంగా పాన్ ఇండియా స్థాయి మూవీని టార్గెట్ చేశాడు. అఖిల్ న‌టిస్తున్న తాజా చిత్రం `ఏజెంట్‌`. స్టైలిష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి డైరెక్ట్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అత్యంత భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీని ఏకే ఎంట‌ర్ టైన్ మెంట్స్, స‌రెండ‌ర్ టు సినిమా బ్యాన‌ర్ పై సుంక‌ర రామ‌బ్ర‌హ్మం నిర్మిస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియ‌న్స్ వ‌ర్క్ చేస్తున్నారు. `సైరా న‌ర‌సింహారెడ్డి` యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని హాలీవుడ్ టెక్నీషియ‌న్ ల తో తెర‌కెక్కించిన సురేంద‌ర్ రెడ్డి `ఏజెంట్‌` మూవీని హాలీవుడ్ టెక్నిషియ‌న్ ల‌తో తెర‌కెక్కిస్తున్నారు. బాండ్ త‌ర‌హా క‌థాంశంతో ఈ మూవీ రూపొందుతున్న‌ట్టుగా తెలుస్తోంది. అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఆ మ‌ధ్య విడుద‌ల చేసిన అఖిల్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది. అఖ‌ల్ నెవ‌ర్ బిఫోర్ సీన్ అవ‌తార్ లో క‌నిపించి ఆక‌ట్టుకున్నారు. వ‌క్కంతం వంశీ క‌థ అందించిన‌ ఈ మూవీ షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. అఖిల్ కెరీర్ ని మ‌లుపు తిప్పే క్రేజీ ప్రాజెక్ట్ గా ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మ‌రో వార్త సినిమాని వార్త‌ల్లో నిలిపింది. ఇప్ప‌టికే అఖిల్ లుక్ తో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా మారిన ఈ ప్రాజెక్ట్ లో మ‌రో స్టార్ చేరారు. ఆయ‌నే మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి.

స్టోరీ ప్ర‌కారం ప‌లు కీల‌క న‌టీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌నున్న ఈ మూవీలో మ‌ల‌యాళ మెగాస్టార్ మ‌మ్ముట్టి ఈ మూవీలో అత్యంత కీల‌కంగా నిలిచే పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తూ చిత్ర బృందం సోమ‌వారం ఓ పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది. `ది డెవిల్ రూత్‌లెస్ సేవియ‌ర్` అంటూ ఓ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది. ఈ పోస్ట‌ర్ లో మ‌మ్ముట్టి క్యాప్ పెట్టుకుని గ‌న్ ప‌ట్టుకుని సీరియ‌స్ లుక్ లో క‌నిపిస్తున్నారు. ఈ పోస్ట‌ర్ ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఈ మూవీలో మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారంటూ గ‌త కొన్ని రోజులుగా వార్త‌లు వినిపించాయి. తాజాగా ఆ వార్త‌ల‌ని నిజం చేస్తూ మేక‌ర్స్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేయ‌డంతో ఈ ప్రాజెక్ట్ ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. పాన్ ఇండియా స్పై థ్రిల్ల‌ర్ గా రూపొందుతున్న ఈ మూవీకి హిప్ అప్ త‌మిళ సంగీతం అందిస్తున్నారు.

ర‌గుల్ హెరియ‌న్ ధారుమ‌న్ కెమెరామెన్ గా వర్క్ చేస్తుండ‌గా నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ న‌వీన్ నూలి ఎడిట‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అవినాష్ కొల్ల ఆర్ట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేస్తున్న ఈ చిత్రంలో అఖిల్ కు జోడీగా సాక్షి వైద్య న‌టిస్తోంది.