Begin typing your search above and press return to search.

`వైఎస్` పాత్ర‌కు మ‌మ్ముట్టి గ్రీన్ సిగ్న‌ల్ ?

By:  Tupaki Desk   |   2 March 2018 10:42 AM GMT
`వైఎస్` పాత్ర‌కు మ‌మ్ముట్టి గ్రీన్ సిగ్న‌ల్ ?
X

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో బ‌యోపిక్ ల ట్రెండ్ న‌డుస్తోంది. రికార్డు స్థాయిలో ఏక‌కాలంలో ఎన్టీఆర్ పై మూడు బ‌యోపిక్ లు తెర‌కెక్క‌బోతోన్న విష‌యం తెలిసిందే. మ‌రోవైపు, లెజెండ‌రీ యాక్ట‌ర్ సావిత్రి జీవిత చ‌రిత్రను `మ‌హాన‌టి` గా తెరకెక్కిస్తున్నారు. తాజాగా, దివంగ‌త ముఖ్య‌మంత్రి వై ఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి పై కూడా ఓ బ‌యోపిక్ రాబోతోంది. ఈ బ‌యోపిక్ లో వైఎస్ పాత్ర‌లో మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మ‌మ్ముట్టి న‌టించ‌బోతోండ‌డంతో ఆ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు ఏర్ప‌డ్డాయి. ఈ బ‌యోపిక్ ను ఓ రేంజ్ లో నిర్మించేందుకు సన్నాహాలు జరుతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌తిష్టాత్మ‌క బ‌యోపిక్ కు యంగ్ డైరెక్ట‌ర్ మహి వి.రాఘవ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌బోతున్నాడు.

‘ఆనందో బ్రహ్మ’తో హిట్ అందుకున‌న‌ యువ దర్శకుడు మహి వి.రాఘవ్.....వైఎస్ బ‌యోపిక్ తీయాల‌ని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడ‌ట‌. ఆ బ‌యోపిక్ కోస‌మే కొన్ని నెల‌లుగా వైఎస్ జీవితానికి సంబంధించిన అనేక విష‌యాల‌పై పరిశోధన చేస్తున్నాడు. దాదాపుగా స్క్రిప్టు కూడా ఫైన‌ల్ అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే, ఆ బ‌యోపిక్ లో వైఎస్ పాత్రలో న‌టించేందుకు....మ‌హి..... మమ్ముట్టిని సంప్ర‌దించాడ‌ట‌. ఆ బ‌యోపిక్ స్టోరీని మ‌హి నెరేట్ చేసిన విధానం మమ్ముట్టికి బాగా న‌చ్చ‌డంతో గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ట‌. ఆ పాత్ర‌కు మమ్ముట్టి స‌రిగ్గా సూట్ అవుతార‌ని, ఆ బ‌యోపిక్ ను భారీ స్థాయిలో నిర్మించి హిట్ కొట్టాల‌ని మ‌హి తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడ‌ట‌. ఈ బ‌యోపిక్ కు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల గురించి త్వ‌ర‌లోనే అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నార‌ని తెలుస్తోంది. అయితే, గ‌తంలోనే దివంగ‌త నేత వైఎస్ మీద వినోద్ కుమార్ హీరోగా ఓ బ‌యోపిక్ వ‌చ్చింది. అయితే, ఆ సినిమాకు ఆశించినంత ఆద‌ర‌ణ ల‌భించ‌లేదు. అందుకే, ఈ సారి నిర్మించ‌బోతోన్న వైఎస్ బ‌యోపిక్ ను మ‌హి ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నాడ‌ని తెలుస్తోంది. దివంగ‌త మ‌హానేత జీవితానికి సంబంధించిన విష‌యాల‌ను ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని మ‌హి గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడ‌ని తెలుస్తోంది.