Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ హీరోయిన్ గ్లామరస్ బికినీ షూట్..!

By:  Tupaki Desk   |   11 May 2021 7:30 AM GMT
ఎన్టీఆర్ హీరోయిన్ గ్లామరస్ బికినీ షూట్..!
X
గ్లామర్ ప్రపంచంలో హీరోయిన్స్ ఎన్నేళ్లు హీరోయిన్స్ గా ఉంటారో తెలియదు కానీ వారి ప్రభావం మాత్రం అలాగే ఉంటుంది. ఎందుకంటే సినీ పరిశ్రమలో గ్లామర్ అనేది కామన్. అలాంటప్పుడు హీరోయిన్స్ చీరకట్టులో కనిపించినా హాట్ గా గ్లామరస్ షో చేసినా ఇట్టే అభిమానం పెంచేసుకుంటారు కుర్రకారు. మరి ఆ అభిమానం హీరోయిన్స్ ఫామ్ లో ఉన్నప్పుడేనా అంటే అలా కాదు. హీరోయిన్స్ ఫామ్ లో ఉన్నా లేకపోయినా అభిమానం అభిమానమే అంటుంటారు ఫ్యాన్స్. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో దశబ్దం కిందటే సింగర్ గా.. హీరోయిన్ గా మంచి పేరు సంపాదించుకొని కొద్దీకాలానికే కనిపించకుండా పోయింది మమతమోహన్ దాస్.

కేరళలో పుట్టి పెరిగిన మమత.. బహ్రెయిన్ లో స్కూలింగ్ పూర్తి చేసి బెంగళూరులోని మౌంట్ కార్మల్ కాలేజీ నుండి బ్యాచిలర్ కంప్యూటర్స్ పట్టా అందుకుంది. అలాగే కర్నాటిక్ - హిందూస్థాని సంగీతం కూడా నేర్చుకుందట. అనంతరం ఇరవై ఏళ్లకే అమ్మడు హీరోయిన్ గా మలయాళం ఇండస్ట్రీలో డెబ్యూ చేసింది. అలా మలయాళంలో హీరోయిన్ గా చేస్తుండగానే తెలుగులో యమదొంగ సినిమాలో అవకాశం అందుకుంది. కానీ యమదొంగ సినిమాకు ముందే మమత సింగర్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తెలుగులో దేవిశ్రీప్రసాద్ సంగీతంలో చాలా పాటలే పాడింది.

కానీ తెలుగులో నటిగా మాత్రం సెట్ కాలేకపోయింది. 2009లో నాగార్జున సరసన కేడి అనే సినిమాలో చివరిగా కనిపించింది మమత. ఆ తర్వాత పెళ్లి - క్యాన్సర్ - విడాకులు ఇలా చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొని మొత్తానికి మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ కంటిన్యూ చేస్తోంది. అయితే ఎన్ని సినిమాలు చేసినా హీరోయిన్ అన్నాక కొంచం గ్లామర్ కూడా పట్టించుకోవాల్సి ఉంటుంది కదా. ప్రస్తుతం అదే పనిలో ఉంటోంది మమత. ముప్పై ఐదేళ్లు పైబడిన ఈ మలయాళం సుందరి సోషల్ మీడియాలో అదిరే ఫోటోషూట్స్ తో మతులు పోగొడుతుంది. తాజాగా మమత గ్లామరస్ ఫోటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఆ ఫోటోలలో అమ్మడు స్విమ్ సూట్ టైప్ గోల్డ్ కలర్ బికినీ ధరించి గుర్రం పై ఫోటోషూట్ చేసింది. చాలాకాలం తర్వాత మమతను అలా గ్లామరస్ పోజుల్లో చూసేసరికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం మమత ఫోటోస్ వైరల్ అవుతున్నాయి.