Begin typing your search above and press return to search.

హ్యార్లీ డేవిడ్ స‌న్ బైక్ పై మ‌మ‌తా మోహ‌న్ దాస్ డేర్ డెవిల్ రైడ్

By:  Tupaki Desk   |   29 April 2021 9:30 AM GMT
హ్యార్లీ డేవిడ్ స‌న్ బైక్ పై మ‌మ‌తా మోహ‌న్ దాస్ డేర్ డెవిల్ రైడ్
X
టాలీవుడ్ లో ఎన్టీఆర్- నాగార్జున‌ స‌హా ప‌లువురు అగ్ర హీరోల చిత్రాల్లో న‌టించిన మ‌మ‌తా మోహ‌న్ దాస్ ఇటీవ‌ల ఇండ‌స్ట్రీకి పూర్తిగా దూర‌మైన సంగ‌తి తెలిసిందే. గాయ‌నిగానూ మ‌మ‌తా ట్యాలెంట్ తెలుగు వారికి ప‌రిచ‌యం చేయాల్సిన‌ అవ‌స‌రంలేదు. ప‌లు చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ ని మ‌మ‌తా మోహ‌న్ దాస్ ఆల‌పించారు. క‌థానాయిక‌గా కెరీర్ పీక్స్ లో ఉండ‌గానే ఈ భామ‌కు బ్రెస్ట్ క్యాన్స‌ర్ రావ‌డంతో ఆ త‌ర్వాత కీమో థెర‌పీ చికిత్స‌తో కోలుకున్నారు.

కొంత బ్రేక్ త‌ర్వాత‌ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చినా టాలీవుడ్ లో ఆశించిన‌న్ని మంచి అవ‌కాశాలు ద‌క్క‌లేదు. కార‌ణం ఏదైనా ప్ర‌స్తుతం మ‌మ‌త తెలుగు చిత్ర‌సీమ‌కు దూరంగా ఉన్నారు. కానీ త‌న మాతృభాష మ‌ల‌యాళంలో ఏకంగా అర‌డ‌జ‌ను సినిమాలు చేస్తూ బిజీగా ఉండ‌డం ఆశ్చ‌ర‌య‌ప‌రుస్తోంది.

2020-21 సీజ‌న్ లో మ‌మ‌తా మోహ‌న్ దాస్ డైరీ లో కాల్షీట్ అన్న‌దే లేదంటే అర్థం చేసుకోవాలి. ఫోరెన్సిక్.. లాల్ బాగ్- రామ‌సేతు- బిలాల్ - మ్యావ్- బ్ర‌మ‌రం-ఎనిమీ-జూత‌న్-అపోస్థ‌ల‌న్ అనే మ‌ల‌యాళ చిత్రాల్లో న‌టిస్తున్న మ‌మ‌తా `ఊమై` అనే త‌మిళ చిత్రంలోనూ క‌థానాయిక‌గా న‌టిస్తోంది.

తాజాగా మ‌మ‌తా మోహ‌న్ దాస్ విదేశాల్లో విలాస‌వంత‌మైన న‌గ‌రంలో మోటార్ రైడింగ్ చేస్తూ ప్ర‌త్య‌క్ష‌మైంది. హ్యార్లీ డేవిడ్ స‌న్ బైక్ పై అలా ర‌య్ ర‌య్ మంటూ దూసుకుపోతున్న మ‌మతా మోహ‌న్ దాస్ ఎంతో స్టైలిష్ గా పోష్ లుక్ తో క‌నిపించారు. క్రైసిస్ కాలంలో షూటింగుల్లేక‌ ఇలా బైక్ రైడ్ బిజీలో ఉన్నాను! అంటూ చెప్పుకొచ్చింది మ‌మ‌తా మోహ‌న్ దాస్. ప్ర‌స్తుతం ఈ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా దూసుకెళుతోంది.