Begin typing your search above and press return to search.

క్యూట్ గర్ల్ ఎంత అందంగా ఉందో

By:  Tupaki Desk   |   28 Jun 2018 12:31 PM GMT
క్యూట్ గర్ల్ ఎంత అందంగా ఉందో
X
టాలీవుడ్ లో మొదటి ఎంట్రీ కొన్నిసార్లు గట్టిదెబ్బె కొడుతుంది. ఇప్పుడున్న చాలా మంది స్టార్ హీరోయిన్స్ మొదటలో ప్లాప్ లతో కెరీర్ ను మొదలు పెట్టినవారే. కాజల్ అగర్వాల్ కి కూడా మొదట్లో పెద్దగా విజయాలు లేవు. కానీ కొంచెం కొంచెంగా హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోలతో జాతకట్టే వరకు వచ్చింది. తన అందంతో అమ్మడు చాలా అవకాశాలను అందుకుంది. అయితే ఇప్పుడు అలాంటి ముద్దుగుమ్మకె ఒక డిజాస్టర్స్ తగిలింది.

పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ గురించి అందరికి తెలిసే ఉంటుంది. ఇటీవల రవితేజ నేల టిక్కెట్టు సినిమాలో కనిపించింది కదా.. తనే మాళవిక శర్మ. ఫ్యాషన్ వరల్డ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ నార్త్ బ్యూటీ టాలీవుడ్ లో ఎంతో ఆశగా అడుగుపెట్టి అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ సినిమా ఏ మాత్రం సక్సెస్ కాలేదు. రవితేజ కెరీర్ లోనే నేల టిక్కెట్టు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచింది. ఇకపోతే మాళవిక శర్మ ఆ విషయాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతోంది.

ఆ సినిమాలో గ్లామర్ గర్ల్ గా కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఇక రీసెంట్ గా సోషల్ మిడియలో పొస్ట్ చేసిన ఒక ఫొటో కూడా అందరిని ఆకట్టుకుంటోంది. ఆ స్టిల్ లో క్లివేజ్ షో ఉన్నప్పటికీ అమ్మడి ఫెస్ చాలా క్యూట్ గా ఉన్నట్లు అర్ధమవుతోంది. మరి ఫ్యూచర్ లో తన క్యూట్ అందాలతో బేబీకి అవకాశాలు వస్తాయేమో చూడాలి.