Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ తో జోడీ.. ఆగలేక పోతుందట!

By:  Tupaki Desk   |   6 Sep 2022 11:30 PM GMT
ప్రభాస్‌ తో జోడీ.. ఆగలేక పోతుందట!
X
యంగ్ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ మరియు మారుతి కాంబినేషన్‌ లో ఒక సినిమా రూపొందబోతున్న విషయం తెల్సిందే. ఇటీవలే పూజా కార్యక్రమాలు కూడా జరిగినట్లుగా సమాచారం అందుతోంది. సినిమా యొక్క షూటింగ్ కార్యక్రమాలను ఇదే నెలలో మొదలు పెట్టబోతున్నట్లుగా ఇండస్ట్రీ నుండి వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయమై యూనిట్‌ సభ్యుల నుండి ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.

ఇక ఈ సినిమాకు రాజా డీలక్స్ అనే టైటిల్‌ ను ఖరారు చేసినట్లుగా చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ విషయమై కూడా ఇప్పటి వరకు క్లారిటీ లేదు. సినిమా గురించి ఏ ఒక్క విషయం గురించి అధికారికంగా క్లారిటీ రాలేదు. ఈ సమయంలోనే ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్‌ నటించబోతున్నారు.. అందులో ఒక హీరోయిన్ గా మాళవిక మోహనన్‌ అంటూ కూడా ప్రచారం జరుగుతోంది.

ఆమె ఈ సినిమాలో నటిస్తున్నట్లుగా అఫిషియల్‌ అనౌన్స్మెంట్‌ రాలేదు.. కానీ ఆమె సన్నిహితుల వద్ద ప్రభాస్ తో నటించబోతున్నట్లుగా చెప్పుకుంటుందట.

అంతే కాకుండా ప్రభాస్ తో షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యేందుకు చాలా ఆసక్తిగా ఉన్నానని.. ఎప్పుడెప్పుడు షూట్‌ లో జాయిన్ అవుతానా అంటూ ఎదురు చూస్తున్నట్లుగా సన్నిహితులతో చెబుతుందట.

ప్రభాస్ తో షూటింగ్‌ లో జాయిన్ అవ్వడం కోసం ఆగలేక పోతున్నాను అంటూ వ్యాఖ్యలు చేసిన మాళవిక మోహనన్‌ కచ్చితంగా ఆ సినిమా తో టాలీవుడ్‌ లో మంచి ఎంట్రీని దక్కించుకుంటుందనే అంతా నమ్ముతున్నారు. కోలీవుడ్‌ లో సూపర్‌ స్టార్స్ కి జోడీగా నటించిన ఈ అమ్మడు ఇప్పుడు ప్రభాస్‌ తో జోడీగా టాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.

మాళవిక మోహనన్‌ ఈ సినిమాలో నటిస్తున్న విషయం అతి త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. మారుతి ఒక మంచి కమర్షియల్‌ సబ్జెక్ట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నాడట. ప్రభాస్ ద్విపాత్రాభినయం అనే వార్తలు కూడా వస్తున్నాయి. అన్ని విషయాలు అతి త్వరలో తేలే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.