Begin typing your search above and press return to search.

పెళ్లాం కొంగు మాటున స్టార్ హీరోల పార్టీలేంటో?

By:  Tupaki Desk   |   25 Jun 2021 10:00 PM IST
పెళ్లాం కొంగు మాటున స్టార్ హీరోల పార్టీలేంటో?
X
సెల‌బ్రిటీ వ‌ర‌ల్డ్ లో గెట్ టుగెద‌ర్ పార్టీలు త‌రుచూ జ‌రుగుతూనే ఉంటాయి. షూటింగ్ లు లేక‌న తీరిక‌ స‌మ‌యం దొరికితే స్నేహితులతో విలాసాల్లో తేలేందుకే ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటారు. ఖాళీ స‌మ‌యాన్ని కుటుంబంతో గ‌డిపేవారు కొంద‌రు ఉన్నా..స్నేహితుల‌తో చిలౌట్ అయ్యే వారు చాలామంది ఉంటారు. నైట్ పార్టీలు...లేట్ నైట్ డిన్న‌ర్లు..షికార్లు సెల‌బ్స్ వ‌ర‌ల్డ్ లో త‌రుచూ జ‌రిగేవే. తాజాగా మాలీవుడ్ లో పాపుల‌ర్ జంట‌లు డిన్న‌ర్ పార్టీ కోసం అంతా ఒక చోట క‌లిసారు.

స్టార్ హీరో ఫహద్ ఫాసిల్- నజ్రియా జంట‌.. అలాగే దుల్కర్ సల్మాన్ - -అమల్ సుఫియా దంప‌తులు.. పృథ్వీరాజ్ - అతని భార్య సుప్రియా మీనన్ లు అంతా ఒకే చోట క‌లిసి డిన్న‌ర్ చేసారు. దానికి సంబంధించిన ఓ ఫోటోని న‌జ్రియా సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. పార్టీ లో డ్రెస్ కోడ్ తో మూడు జంట‌లు హాజ‌ర‌య్యాయి. అంతా బ్లాక్ దుస్తుల్ని ధ‌రించారు. న‌జ్రియా అయితే టాప్ టు బాట‌మ్ అదే కోడ్ లో క‌నిపిస్తున్నారు. ఇలాంటి పార్టీల ఏర్పాటు చేయ‌డంలో న‌జ్రియా ఎక్కువ‌గా చొర‌వ తీసుకుంటారుట‌. తాజాగా క‌పుల్ పార్టీ వెన్యూ ఎక్క‌డ అన్న‌ది లీక్ కాలేదు. కేవ‌లం ఫోటోలు మాత్ర‌మే బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

పెళ్లికి ముందు న‌జ్రియాకు పార్టీ క‌ల్చ‌ర్ అల‌వాటు. కానీ వివాహానంత‌రం ఆ క‌ల్చ‌ర్ కు బాగా దూర‌మైంద‌ని తెలుస్తోంది. ఈ మూడు జంట‌లు ఎప్ప‌టి నుంచో స‌న్నిహితంగా పార్టీల‌కు అల‌వాటు ప‌డ్డారు. ముఖ్యంగా అమ‌ల్ సూఫియా.. న‌జ్రియా కుటుంబానికి బాగా ద‌గ్గ‌ర బంధువు కావ‌డంతో ఆ ఇద్ద‌రూ పార్టీల‌కు ప్లాన్ చేస్తుంటారు. ప్ర‌స్తుతం ఈ మూడు జంట‌లు మ‌ల‌యాళంలో వ‌రుస‌ సినిమాల‌తో బిజీగానే ఉన్నాయి. న‌జ్రియా టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. నాని స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టించ‌డానికి సంత‌కం చేయ‌గా ఫ‌హ‌ద్ ఫాజిల్ పుష్ప చిత్రంలో విల‌న్ గా న‌టిస్తున్నారు.