Begin typing your search above and press return to search.

ఫ్లాట్ లేకుండానే ఖాళీ చేయిస్తారా: మ‌ల్లికా

By:  Tupaki Desk   |   16 Dec 2017 5:01 AM GMT
ఫ్లాట్ లేకుండానే ఖాళీ చేయిస్తారా: మ‌ల్లికా
X
బాలీవుడ్ ఐటం బాంబ్ మ‌ల్లికా షెరావ‌త్ కొంత‌కాలంగా సినిమాల‌కు దూరంగా ఉంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ బాలీవుడ్ ప్ర‌ముఖ‌ శృంగార తార‌కు సోష‌ల్ మీడియాలో కూడా విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మ‌ల్లిక ప్ర‌స్తుతం త‌న బాయ్ ఫ్రెండ్ సిరెల్ అగ్జాన్ ఫాన్స్ తో క‌లిసి పారిస్ లోని ఎరోన్ డిస్పెమెంట్ లో గ‌ల ఒక‌ అపార్ట్ మెంట్ లో ఉంటోంది. అయితే....మ‌ల్లిక ఆ ఫ్లాట్ అద్దెను కొంత‌కాలంగా చెల్లించ‌డంలేద‌ని, ఆ బ‌కాయి దాదాపు రూ.64 ల‌క్ష‌లకు చేర‌డంతో య‌జ‌మాని ఫ్లాట్ ఖాళీ చేయించాడ‌ని శుక్ర‌వారం మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. గ‌తంలో ఒక వెలుగు వెలిగి మ‌ల్లిక ఇపుడు దీన స్థితిలో ఉంద‌ని బాలీవుడ్ మీడియాలో వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే, ఆ వార్త‌ల‌ను మ‌ల్లిక ఖండిస్తూ రెండు రోజుల క్రితం ట్వీట్ చేసింది. త‌న‌కు పారిస్ లో ఫ్లాట్ ఉంద‌ని మీడియాలోని కొంద‌రు వ్య‌క్తులు అనుకుంటున్నార‌ని, అందులో నిజం లేద‌ని, ఒక‌వేళ ఎవ‌ర‌న్నాత‌న‌కు ఫ్లాట్ డొనేట్ చేస్తే ద‌య‌చేసి ఆ అడ్ర‌స్ పంపాల‌ని సెటైర్ వేసింది.

అయితే, మ‌ల్లిక ట్వీట్ చేసిన త‌ర్వాత కూడా బాలీవుడ్ మీడియాలో ఆ పుకార్లు ఆగలేదు. మ‌ల్లిక త‌న‌కు సొంత ఫ్లాట్ లేద‌ని చెప్పిందా? లేక అద్దె ఫ్లాట్ లో ఉండ‌డం లేద‌ని చెప్పిందా? అన్న విష‌యంపై క్లారిటీ లేద‌ని బాలీవుడ్ మీడియాలో క‌థ‌నాలు వ‌చ్చాయి. దీంతో, మ‌ల్లిక తాజాగా ఈ రోజు ఉద‌యం ఆ ధ‌ర్మ సందేహాన్ని తీరుస్తూ మళ్లీ ట్వీట్ చేసింది. `` నాకు పారిస్ లో సొంత ఫ్లాట్ గానీ, అద్దె ఫ్లాట్ గానీ లేదు. అటువంట‌పుడు ఖాళీ చేయించే ప్ర‌శ్నే ఉత్ప‌న్న‌మ‌వ‌దు``అంటూ మ‌ల్లిక రెండోసారి క్లారిటీ ఇచ్చింది. దాంతో పాటు పుణె మిర్ర‌ర్ ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థ‌నం క్లిప్పింగ్ ను పోస్ట్ చేసి ఆ క‌థ‌నం రాసిన జ‌ర్న‌లిస్టు సంయుక్త‌కు ధ‌న్య‌వాదాలు తెలిపింది. ``నాకు పారిస్ లో నివ‌సించ‌డం లేదు. సిరెల్ నా భ‌ర్త కాదు`` అన్న శీర్షికతో ఆ క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది. త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై ఎందుకు ఫోక‌స్ చేస్తున్నార‌ని మ‌ల్లిక ఆ క‌థ‌నంలో ఆవేద‌న వ్య‌క్తం చేసింది. సిరెల్ ను త‌న స్నేహితుడిగా భావించ‌వ‌చ్చ‌ని తెలిపింది.