Begin typing your search above and press return to search.

భాయ్ కి మ‌ల్లిక‌ ముద్దుల పాఠం

By:  Tupaki Desk   |   25 Dec 2019 9:33 AM GMT
భాయ్ కి మ‌ల్లిక‌ ముద్దుల పాఠం
X
ముద్దు అంటేనే ఆమ‌డ దూరం పారి పోతాడు భాయ్... అలాంటి భాయ్ నే లైన్ లో పెట్టేసిందేమిటో హిస్ బ్యూటీ మ‌ల్లికా శ‌రావ‌త్. ము..ము..ము.. ముద్దంటే చేదా! నీకా ఉద్ధేశం లేదా? అన్న‌ట్టుగానే ఉందీ వ్య‌వ‌హారం. డీప్ గా డీటెయిల్స్ లోకి వెళ‌దామా..!


కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ ఎంత గ్రంధ సాంగుడు అయినా త‌న‌కో వీక్ నెస్ ఉంద‌ని చెబుతుంటారు. ముద్దు అంటే స‌రిప‌డ‌ద‌ని.. అందుకే అత‌డి సినిమాల్లో ముద్దు స‌న్నివేశాలు ఉండ‌వ‌ని చెబుతుంటారంతా. త‌న క్లోజ్ బ‌డ్డీస్ క‌త్రిన‌తో న‌టించినా ముద్దులు కురిపించేందుకు ఎందుక‌నో మొహ‌మాట ప‌డుతుంటాడ‌ట‌. అందుకే ఇటీవ‌ల భాయ్ సినిమాల్లో ఆ రూల్ ని తూ.చ త‌ప్ప‌క‌ అప్ల‌య్ చేశాడు. అదంతా స‌రే కానీ.. అలాంటి ఈ బ్యాచిల‌ర్ భాయ్ ఉన్న‌ట్టుండి రొమాంటిక్ మూడ్ లోకి వెళ్లిపోయాడేమిటో. హాట్ బ్యూటీ మ‌ల్లికా షెర‌వ‌త్ తో స్వీట్లు తింటూ ఎంజాయ్ చేయ‌డ‌మే గాక‌.. ముద్దుకు మూతి మూతి రాసుకునేంత దూరంలో క‌నిపించాడు.

తాజాగా ఆ స‌న్ని వేశానికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. మ‌రి భాయ్ కి అలా ఓ ఐటం బాంబ్ స్వీట్లు తినిపిస్తూ ముద్దు చేస్తుంటే.. అభిమానులు..నెటి జ‌నులు ఊరుకుంటారా? ఓ ఆట ఆడేసుకోరూ! ఆ ఇద్ద‌రి పైనా అదే రేంజులో నెటిజ‌నులు ట్రోల్ చేస్తున్నారు. క‌ట్టుకున్న భ‌ర్త‌కు భార్య రొమాంటిక్ గా స్వీట్లు తినిపిస్తున‌ట్లుందని కొంద‌రు కామెంట్లు విసిరేస్తుంటే.. ఇంకొంద‌రు బ్యాచిల‌ర్ స్టార్ కే ముద్దులు నేర్పిస్తున్నావా? అంటూ కామెంట్ల తో విరుచుకు ప‌డుతున్నారు. మరికొంద‌రైతే భాయ్ కి అమ్మాయి దొర‌క‌లేన‌ట్లుంది. క‌నీసం మ‌ల్లికా అయినా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని అభిప్రాయ‌ప‌డ్డారు.

ప్ర‌స్తుతం మ‌ల్లికా ష‌రావ‌త్ కు బాలీవుడ్ లో పెద్ద‌గా అవ‌కాశాలు రాలేదు. ఒక‌వేళ అవ‌కాశం వ‌చ్చినా మ‌ల్లికా కు ఉన్న క్రేజ్ నేప‌థ్యంలో అడ‌ల్ట్ స‌న్నివేశాల‌కే వాడుతున్నారు. చివ‌రిగా జీన‌త్ అనే సినిమాలో న‌టించింది. ఆ తర్వాత అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో వెబ్ సిరీస్ ల‌వైపు దృష్టి పెట్టింది. ఇప్ప‌టికే `బూ స‌బ్ కి ఫ‌టేగీ` అనే వెబ్ సిరీస్ లో న‌టించింది. తర్వాత ఫారిన్ చెక్కేసి అక్క‌డ ఓ బిజినెస్ మెన్ తో డేటింగ్ లో ఉంది. మ‌రి అత‌డిన‌యినా మ‌నువాడుతుందేమో చూడాలి. ఇక భాయ్ న‌టించిన ద‌బంగ్ 3 బాక్సాఫీస్ వ‌ద్ద వంద కోట్ల వ‌సూళ్ల‌కే చ‌తికిల‌బ‌డింద‌న్న టాక్ వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే.