Begin typing your search above and press return to search.

నా నడుముపై కోడిగుడ్లు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు

By:  Tupaki Desk   |   2 July 2019 1:46 PM IST
నా నడుముపై కోడిగుడ్లు పెట్టి అసభ్యంగా ప్రవర్తించాడు
X
బాలీవుడ్‌ లో ఐటెం సాంగ్స్‌ కు కేరాఫ్‌ అడ్రస్‌ అయిన మల్లికా శెరావత్‌ గత కొంత కాలంగా సినిమాల సంఖ్య తగ్గించింది. ఈమె గతంతో పోల్చితే చాలా తక్కువ ఆఫర్లను దక్కించుకుంటుంది. తాజాగా ఈమె 'బూ సబ్కి ఫేటేగి' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రం ప్రమోషన్‌ లో భాగంగా మల్లికా శరావత్‌ కపిల్‌ శర్మ టాక్‌ షో లో పాల్గొంది. ఈ సందర్బంగా పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టిన మల్లికా శరావత్‌ తాను ఎదుర్కొన్న లైంగిక వేదింపులను చెప్పుకొచ్చింది.

బాలీవుడ్‌ లో ఎంతో మంది లైంగిక వేదింపులు ఎదుర్కొన్నట్లుగా నేను కూడా కొందరు దర్శకుల నుండి లైంగిక వేదింపులు ఎదుర్కొన్నాను. నాతో ఒక పాట చిత్రీకరణ సమయంలో దర్శకుడు నన్ను చాలా వేదించాడు. నా నడుమును అందంగా చూపిస్తానంటూ అసహ్యంగా నాతో ప్రవర్తించాడు. నా నడుముపై కోడి గుడ్లు పెట్టి అత్యంత నీచంగా వ్యవహరించాడు. ఆ సంఘటన నాకు చాలా బాధ అనిపించింది. అతడి తీరు నాకు కోపం తెప్పించిందని చెప్పుకొచ్చింది.

తెర వెనుక హీరోలు మరియు దర్శకులతో సన్నిహితంగా ఉండక పోవడం వల్ల నేను చాలా ఆఫర్లు కోల్పోయాను అని... నాకు వచ్చిన ఆఫర్లు కూడా కొన్ని నేను వారికి సహకరించను అనే ఉద్దేశ్యంతో వారి స్నేహితులకు లేదా లవర్స్‌ కు ఇచ్చుకున్నారంటూ మల్లికా శెరావత్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. తాను అన్ని విధాలుగా వారికి ఉపయోగపడేందుకు ముందే నో చెప్పేదాన్ని. అందుకే నా సినిమాల సంఖ్య తక్కువగా ఉన్నాయని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది.