Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మర్డర్ అంటీ వచ్చిందోచ్

By:  Tupaki Desk   |   6 Dec 2018 4:34 AM GMT
ఫోటో స్టొరీ: మర్డర్ అంటీ వచ్చిందోచ్
X
ఇప్పుడంటే బాలీవుడ్ భామలలో అందరూ ఘాటుగా ఉంటున్నారు గానీ ఓ పదేళ్ళ క్రితం కొందరే అలా ఉండేవారు. అప్పడు బోల్డ్ గా ఉండమన్నా లిప్పు లాకులన్నా వెంటనే యస్ చెప్పి సిల్వర్ స్క్రీన్ పై మంటలు రేపి.. ఈ జెనరేషన్ భామలకు బోల్డ్ నెస్ అంటే ఏంటో చూపించిన సుందరి మల్లికా షెరావత్. 'మర్డర్' లాంటి సినిమాలతో ఆమె క్రేజు అప్పట్లో కాశాన్ని తాకేది. ఇప్పుడు పూర్తిగా ఫేడ్ అవుట్ అయింది.

కానీ 'మర్డర్' రిలీజ్ అయిన తర్వాత దాదాపు పదేళ్ళకు మళ్ళీ తన ఘాటు అవతారాన్ని చూపిస్తోంది మల్లికా. ఈమధ్యే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా లేటెస్ట్ గా ఫోటో షూట్ చేసిన హాట్ స్టిల్స్ పోస్ట్ చేసింది. చూస్తుంటే ఏదో ఇన్నర్ వేర్ యాడ్ కోసం తన ఒంపుసొంపుల వయ్యారాలను ఒలికించినట్టుగా ఉంది. తనకు మాత్రమే సాధ్యమైన స్టైల్లో బెడ్ మీద సైడ్ కు తిరిగి కూర్చుంది. బ్లాక్ అండ్ వైట్ షేడ్ లో ఫోటో తీయడంతో మల్లికా మహా సెక్సీగా ఉంది.

ఫోటో చూసి ఆమె పాతికేళ్ళ భామ అని మోసపోతారేమో. 'మర్డర్' సినిమా చేసింది ముప్ఫైల్లో ఉన్నప్పుడు. ఇప్పుడు వయసు నలభై పైనే.. కరెక్ట్ గా అయితే 42. అంటే మర్డర్ అంటీ.. మల్లికా ఆంటీ అని పిలుచుకోవాలి కదా. మలైకా.. మల్లికా..ఇలాంటి పేర్లతో ఉండే ఆంటీలకు వయస్సు కనిపించదా?