Begin typing your search above and press return to search.
కాంట్రవర్సీ రూట్లోనే 'మళ్ళీ పెళ్లి'
By: Tupaki Desk | 27 March 2023 4:21 PM ISTఅనేక క్లాసిక్ సినిమాలు, బ్లాక్ బస్టర్ లు అందించిన నిర్మాత ఎంఎస్ రాజు. దేవి పుత్రుడు, మనసంతా నువ్వే, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి లాంటి సూపర్ హిట్ సినిమాలు అందించారు. దర్శకుడిగా మారి పూర్తిగా భిన్నమైన రూట్ లోకి వెళ్లారు. రిలేషన్ షిప్స్, న్యూ ఏజ్ రొమాన్స్ పై బోల్డ్, కాంట్రవర్శియల్ సినిమాలు చేస్తున్నారు. యూత్ సెంట్రిక్ సినిమాలపైనే తన ఫోకస్ పెట్టారు.
'డర్టీ హరి' లాంటి బోల్డ్ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాతో ఎంఎస్ రాజు లాంటి విజయవంతమైన ప్రొడ్యూసర్ ఇలాంటి సినిమాలు తీయడం ఏంటని అంతా అనుకున్నారు. ఆ తర్వాత '7 డేస్ 6 నైట్స్' అనే యూత్ ఫుల్ రొమాంటిక్ సినిమా చేసి తన పంథా ఏంటో చెప్పకనే చెప్పారు.
ఇప్పుడు ఆ జాబితాలోకి 'మళ్లీ పెళ్లి' అనే సినిమాను చేరుస్తున్నారు. నరేష్ వీకే, పవిత్రా లోకేష్ ల ప్రేమాయణం, వివాదాలు, పెళ్లి విషయాలతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు ఎంఎస్ రాజు.
'మళ్లీ పెళ్లి' సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కావడంతో మళ్లీ చర్చకు దారి తీశారు. నరేష్, పవిత్ర లోకేష్ లు ఉన్న 'మళ్లీ పెళ్లి' టైటిల్ రివీల్, ఫస్ట్ లుక్ పోస్టర్ తెలుగుతో పాటు కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే.
'మళ్లీ పెళ్లి' సినిమా గురించి ప్రధాన స్రవంతి మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా వార్తలు అందించింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ కి పూర్తి భిన్నంగా 'మళ్లీ పెళ్లి' సినిమా ఉండబోతుందని అంటున్నారు. పెళ్లి, మళ్లీ పెళ్లి వంటి అంశాలతో 'మళ్లీ పెళ్లి' సినిమా చాలా బోల్డ్ గా, వివాదాస్పదంగా ఉండబోతోందని తెలుస్తోంది.
నరేష్ వీకే, పవిత్ర లోకేష్ లను సెంటర్ గా చేసుకుని వివాహ వ్యవస్థపై వివాదాస్పద చిత్రాన్ని ఎంఎస్ రాజు ప్లాన్ చేసినట్లు ఇన్ సైడ్ టాక్. 'మళ్లీ పెళ్లి' చిత్రంలో నరేష్, పవిత్రల నిజ జీవిత సంఘటనలు, ఆఫ్-స్క్రీన్ రిలేషన్ షిప్ లోని అంశాలు ఉంటాయని సమాచారం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.