Begin typing your search above and press return to search.
ఆ సినిమాలతో పోటీగా మరో చిన్న సినిమా
By: Tupaki Desk | 17 Oct 2019 9:50 PM ISTదసరా సీజన్ హడావుడి ముగిసింది. దీంతో మీడియం రేంజ్ సినిమాలు.. చిన్న సినిమాలు రిలీజుకు సిద్ధం అవుతున్నాయి. ఈ శుక్రవారం 'రాజుగారి గది 3'.. 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలతో పాటుగా మరో చిన్న సినిమా కూడా రిలీజ్ అవుతోంది. అదే నూతన నటీనటులతో తెరకెక్కిన 'మళ్ళీ మళ్ళీ చూశా'. ఈ సినిమాకు పని చేసిన వారందరూ కొత్తవారే అయినప్పటికీ ధైర్యంగా పోటీలో రిలీజ్ చేయడం విశేషం.
హేమంత్ కార్తీక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనురాగ్.. శ్వేత అవస్థి..కైరవి ఠక్కర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతం అందించారు. 'మళ్ళీ మళ్ళీ చూశా' చిన్న సినిమా అయినా కాస్త పేరున్న ఇతర చిన్న సినిమాలకు పోటీగా విడుదల చేయడం చూస్తే మేకర్లతో తమ సినిమాపై ఎంత నమ్మకం ఉందనేది తెలుస్తోంది. పోటీలో ఉన్న 'రాజుగారి గది 3' లో నటించి అశ్విన్ చిన్న హీరోనే.. మరోవైపు 'ఆపరేషన్ గోల్డ్ ఫిష్' హీరో ఆది కూడా చిన్న హీరోనే.. విజయంకోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న హీరో. పోటీలో ఉన్న సినిమాల్లో ఎవరి కంటెంట్ ప్రేక్షకులకు కనెక్ట్ అయితే ఆ సినిమానే బాక్స్ ఆఫీస్ విజేతగా నిలుస్తుంది. టాక్ బయటకు రానంతవరకూ చిన్న సినిమా పెద్ద సినిమా అనే తేడాలు ఉంటాయేమో కానీ ఒక్కసారి టాక్ బయటకు వస్తే మాత్రం ఆ తేడాలు ఉండవు.
మరి శుక్రవారం రిలీజులలో 'మళ్ళీ మళ్ళీ చూశా' సినిమా తన సత్తా చాటుతుందా లేదా అనేది తెలియాలంటే వేచి చూడాలి. సరే సినిమా ఎలా ఉంటుంది తెలియాలంటే ఒకసారి శాంపిల్ గా ట్రైలర్ చూడాలిగా.. ఆల్రెడీ చూస్తే సరే.. చూడకపోతే మాత్రం ఇప్పుడు చూసేయండి.