Begin typing your search above and press return to search.

మనోజ్ షాక్ నుంచి సింగం బయటేస్తాడా?

By:  Tupaki Desk   |   8 Aug 2016 4:18 AM GMT
మనోజ్ షాక్ నుంచి సింగం బయటేస్తాడా?
X
రెగ్యులర్ సినిమాలు కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ గా నిర్మించే అభిరుచి ఉన్న నిర్మాతల్లో మల్కాపురం శివకుమార్ ఒకరు. కాకపోతే ఈయనీమధ్య వరుసగా గట్టి దెబ్బే తగిలింది. రీసెంట్ గా మంచు మనోజ్ నటించిన శౌర్యను చాలా ప్లాన్డ్ గా రిలీజ్ చేసినా సినిమా మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో కొత్త సినిమా విషయంలో కొంత గ్యాప్ తీసుకున్న ఈ నిర్మాత.. ఇప్పుడో డబ్బింగ్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నాడు.

ఎస్3 అనే టైటిల్ పై తెరకెక్కుతున్న సింగం మూడో చిత్రానికి తెలుగు డబ్బింగ్ రైట్స్ ను సురక్షన్ ఎంటర్టెయిన్మెంట్ అధినేత మల్కాపురం శివకుమార్ దక్కించుకున్నారు. ఈ సిరీస్ లో మొదటి రెండు చిత్రాలు భారీ సక్సెస్ లుగా నిలవడంతో.. మూడో భాగంపై అంచనాలు చాలానే ఉన్నాయి. అయితే తెలుగులో కూడా ఈ సిరీస్ సూపర్ హిట్ కావడం విశేషం. సింగం-3 పై ముందునుంచే ప్లాన్డ్ గా ఉన్న యూనిట్.. వైజాగ్ - హైద్రాబాద్ లలో కూడా ఎక్కువ భాగం సన్నివేశాలు తెరకెక్కించడంతో.. లోకల్ ఫ్లేవర్ బాగానే తగలనుంది.

అనుష్క - శృతి హాసన్ లు సింగం3లో నటిస్తుండగా.. ఈ చిత్రానికి హారిస్ జయరాజ్ సంగీతం అందించనున్నాడు. సూర్యకు తెలుగులో ఉన్న మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని.. ఈ సినిమా రైట్స్ కోసం భారీ పోటీనే నెలకొన్నా చివరకు.. మల్కాపురం శివకుమార్ దక్కించుకున్నారు. శౌర్య నష్టాల నుంచి ఈ నిర్మాతను బయటపడేసే బాధ్యత ఇప్పుడు సూర్యపై ఉందన్న మాట.