Begin typing your search above and press return to search.

పవిత్ర, నరేష్.. ఫోకస్ గట్టిగానే ఉంది

By:  Tupaki Desk   |   24 May 2023 3:29 PM IST
పవిత్ర, నరేష్.. ఫోకస్ గట్టిగానే ఉంది
X
ప్రస్తుతం టాలీవుడ్ లో అందరూ చర్చించుకునే అంశాలలో టాప్ లో ఏదైనా ఉంటుంది అంటే కచ్చితంగా నరేష్, పవిత్ర లోకేష్ రిలేషన్ షిప్ అని చెప్పాలి. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వీరిద్దరి బంధం హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది. వీరిద్దరి రిలేషన్ ని కొంతమంది స్వాగతి స్తే మరికొంత మంది దారుణంగా ట్రోల్ చేశారు. ఒక ఏజ్ తో తర్వాత సెలబ్రిటీలు రిలేషన్ షిప్ పెట్టుకుంటే యాక్సప్ట్ చేయలేరని నరేష్, పవిత్ర లోకేష్ పై జరిగిన ట్రోలింగ్ చూస్తేనే తెలిసిపోతుంది.

ఇదిలా ఉంటే సమాజాన్ని లెక్క చేయకుండా నరేష్, పవిత్ర తన బంధాన్ని మరింత ముందుకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు వీరిదరు తమ రియల్ లైఫ్ స్టొరీతో మళ్ళీ పెళ్లి అనే సినిమా చేశారు. ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నరేష్ తన విజయ్ కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మించడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకి వచ్చి ఆకట్టుకుంది.

ఇక ఈ ట్రైలర్ చూసిన ఎవరైనా నరేష్ మొదటి భార్యతో గొడవలు, పవిత్ర లోకేష్ తో బంధం మధ్య జరిగిన సంఘటనల తోనే చేసారని అర్ధమవుతోంది. దీనికి ఎంఎస్ రాజు యూత్ కి కనెక్ట్ అయ్యే బోల్డ్ కంటెంట్ ని కూడా యాడ్ చేశారు. దీంతో మళ్ళీ పెళ్లి మూవీ సోషల్ మీడియాలో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. మే 26న రిలీజ్ కాబోయే ఈ సినిమాని బయ్యర్లు కూడా ఎగబడి కొన్నారంట.

ముఖ్యంగా యూత్ ఆడియన్స్ నుంచి ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉందనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే నరేష్ ఈ సినిమా డిస్టిబ్యూషన్ రైట్స్ ని ఫ్యాన్సీ రేట్ కి అమ్మేసినట్లు తెలుస్తోంది. మే 26న రిలీజ్ అవుతున్నవాన్ని చిన్న చిత్రాలే. వీటిలో ఎక్కువ హైప్ ఉన్నదీ అంటే మళ్ళీ పెళ్లి సినిమాకే అని చెప్పాలి.

రియల్ లైఫ్ లో సెన్సేషన్ గా మారిపోయిన నరేష్, పవిత్ర లోకేష్ బంధానికి నెక్స్ట్ లెవల్ గా వస్తోన్న మళ్ళీ పెళ్లికి కావాల్సినంత పబ్లిసిటీ అయితే దొరికింది. దానికి తగ్గట్లుగానే మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరి ఈ రియల్ లైఫ్ జోడీ, బిగ్ స్క్రీన్ పై తమ రియల్ బోల్డ్ అండ్ రొమాంటిక్ పెర్ఫార్మెన్స్ ఏ మేరకు మెప్పిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.