Begin typing your search above and press return to search.

ఒకే సారి మెగా.. నందమూరి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది

By:  Tupaki Desk   |   8 Aug 2021 6:00 AM IST
ఒకే సారి మెగా.. నందమూరి సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది
X
మలయాళి క్యూట్‌ హాట్‌ బ్యూటీ సంయుక్త మీనన్‌ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇప్పటికే పలు భాషల్లో సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇప్పుడు తెలుగు లో అవకాశం దక్కించుకుంది. తెలుగు లో ఈమె ఇప్పటికే కళ్యాణ్‌ రామ్ కు జోడీగా ఒక సినిమాలో నటిస్తూ ఉంది. ఆ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలో విడుదల అవ్వాల్సి ఉంది. సంయుక్త మీనన్‌ తెలుగు లో మొదటి సినిమా రాకుండానే అప్పుడే తెలుగు లో రెండవ ఆఫర్‌ ను దక్కించుకుంది. సాదారణంగా ఇలా చాలా తక్కువ మంది హీరోయిన్స్ కు జరుగుతుంది. మొదటి సినిమా విడుదల కాకుండానే రెండవ ఛాన్స్ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ అమ్మడు భవిష్యత్తులో టాలీవుడ్‌ లో టాప్ స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంటుందనే కామెంట్స్‌ వస్తున్నాయి.

కళ్యాణ్ రామ్‌ తో సినిమా అతి త్వరలో పూర్తి అవ్వబోతుందట. విడుదల విషయమై కాస్త సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమాతో పాటు మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ ప్రస్తుతం నటిస్తున్న సినిమాలో కూడా ఈమె ఎంపిక అయ్యింది. సుకుమార్‌ తో కలిసి బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సుకుమార్‌ రైటింగ్స్ బ్యానర్‌ లో వస్తున్న ప్రతి సినిమా కూడా ఈమద్య కాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఉప్పెన సినిమా తో సుకుమార్‌ బ్రాండ్‌ వ్యాల్యూ పెరిగింది. కనుక ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

ఈ సినిమాకు సుకుమార్‌ శిష్యుడు అయిన కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవలే రిపబ్లిక్ సినిమా షూటింగ్‌ ను ముగించిన సాయి ధరమ్‌ తేజ్ తాజాగా ఈ సినిమా షూటింగ్‌ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో షూటింగ్ కు సంయుక్త మీనన్‌ సిద్దం అవుతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇంకా టైటిల్‌ ఖరారు కాని ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. కథ మరియు స్క్రీన్‌ ప్లే విషయంలో సుకుమార్‌ సలహాలు సూచనలు ఉంటాయి కనుక తప్పకుండా ఈసినిమా విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు. ఈ సినిమా సాయి ధరమ్‌ తేజ్ కెరీర్‌ లో 15వ సినిమాగా రూపొందుతుంది.