Begin typing your search above and press return to search.
తెలుగు సినిమాలంటేనే భయపడుతున్న మలయాళ స్టార్ హీరోలు..!
By: Tupaki Desk | 13 May 2021 8:00 AM ISTటాలీవుడ్ ఫిలిం మేకర్స్ అందరూ ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ పై దృష్టి సారించారు. క్రేజ్ తో సంబంధం లేకుండా ప్రతి హీరో కూడా తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో తమ సినిమాలను విడుదల చేస్తున్నారు. దీని కోసం ఆయా ఇండస్ట్రీలలో మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని అక్కడి స్టార్స్ ని తెలుగు చిత్రాల్లో నటింపజేస్తున్నారు. తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల స్టార్స్ ని తీసుకొని వారి రేంజ్ కి తగ్గట్టుగానే భారీ రెమ్యూనరేషన్ ఇస్తున్నారు. ఈ క్రమంలో పలువురు మలయాళ స్టార్ హీరోలు కూడా తెలుగు సినిమాల్లో ప్రత్యేక పాత్రలు పోషించారు.
టాలీవుడ్ లో ముంబై భామల డిమాండ్స్ ని తట్టుకోలేని నిర్మాతలు మలయాళ కుట్టీలను ఇండస్ట్రీకి తీసుకొచ్చేవారు. వీళ్ళు ఈగోలు లేకుండా హీరో ఎవరైనా నటించాడని సిద్ధంగా ఉంటారు కాబట్టి తెలుగు ఇండస్ట్రీలో మలయాళీ ముద్దుగుమ్మల హవా ఎప్పటి నుంచో నడుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు మలయాళ స్టార్ హీరోలు కూడా వచ్చేస్తున్నారు. టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ ఇచ్చే భారీ పారితోషికం కోసమో ఇక్కడ కూడా మార్కెట్ ని పెంచుకోవాలనే ఉద్దేశ్యంతోనో మాలీవుడ్ స్టార్ హీరోలు కొన్ని తెలుగు సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించారు.
అయితే ఆ మలయాళ స్టార్స్ కి ఆ తరువాత పెద్దగా సినిమాలు రాకపోవడం గమనార్హం. దీనికి తోడు తెలుగు డైరెక్టర్లు కొందరు వాళ్ళని క్యారెక్టర్ ఆర్టిస్ట్ రేంజ్ కి దిగజార్చే రోల్స్ ఆఫర్ చేస్తున్నారట. అందుకే ఇప్పుడు తెలుగు సినిమాలు అంటేనే భయపడుతున్న మలయాళ స్టార్స్ ఆచితూచి నిర్ణయం తీసుకుంటున్నారని తెలుస్తోంది.