Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ ను మరింత టైట్‌ చేస్తున్నారు

By:  Tupaki Desk   |   20 Feb 2019 5:03 PM GMT
హీరోయిన్‌ ను మరింత టైట్‌ చేస్తున్నారు
X
మలయాళి సీనియర్‌ హీరోయిన్‌ మంజు వారియర్‌ చిక్కుల్లో పడింది. ఈమె కొన్ని నెలల క్రితం ఒక స్లమ్‌ ఏరియాకు వెళ్లింది, అక్కడ పేదవారికి ఇల్లు కట్టిస్తానంటూ హామీ ఇచ్చింది. ఆ హామీ ఎన్ని నెలలు అయినా తీర్చక పోవడంతో ఆమె వద్దకు సదరు స్లమ్‌ ఏరియాకు చెందిన వారు వెళ్లి ఇల్లు కట్టించాల్సిందిగా డిమాండ్‌ చేశారు. హామీ ఇచ్చిన ప్రకారం ఇల్లు కట్టించకుంటే దర్నాకు దిగుతామని కొన్ని రోజుల క్రితం వార్నింగ్‌ కూడా ఇచ్చారు. తాజాగా మరోసారి ఆమెను స్థానికులు కలిసి చర్చించినట్లుగా తెలుస్తోంది.

గతంలో ఇచ్చిన హామీ మేరకు తమకు ఇల్లులు కట్టించాల్సిందిగా వారు మంజు వారియర్‌ వద్ద విజ్ఞప్తి చేశారట. ఇచ్చిన హామీని నిలబెట్టుకోకుంటే మాత్రం ఇప్పటికే ప్రకటించిన విధంగా దర్నాకు దిగడంతో పాటు, పెద్ద ఎత్తున ఆమె ఇంటి ముందు ఆందోళన కార్యక్రమాలు కూడా చేస్తామంటూ హెచ్చరించారు. దాంతో మంజు వారియర్‌ మరింతగా చిక్కుల్లో పడ్డట్లయ్యింది. అప్పుడు ఏదో పబ్లిసిటీ కోసమో మరే కారణమో కాని మంజు ఇల్లు కట్టిస్తానంటూ హామీ ఇచ్చింది. కాని ఇప్పుడు మాత్రం ఆమె ఇల్లులు కట్టించే పరిస్థితి లేదు. మరి ఈ సమయంలో ఆమె ఏం చేస్తుందో చూడాలి.