Begin typing your search above and press return to search.

హీరోయిన్‌ గొడవ.. పోలీసుల రంగ ప్రవేశం

By:  Tupaki Desk   |   21 Dec 2018 3:31 PM IST
హీరోయిన్‌ గొడవ.. పోలీసుల రంగ ప్రవేశం
X
మలయాళ హీరోయిన్‌ మంజు సవేకర్‌ మరియు ఆమె బస చేస్తున్న హోటల్‌ సిబ్బందికి మద్య గొడవ జరిగింది. ఆ గొడవలో ఏకంగా పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వైపుల సర్ది చెప్పి గొడవను సర్దుమనిగేలా చేశారు. ఈ గొడవలో హీరోయిన్‌ ఓవర్‌ యాక్షన్‌ కాస్త ఎక్కువ అయ్యిందని కొందరు అంటూ ఉంటే, మరి కొందరు మాత్రం హీరోయిన్‌ పట్ల హోటల్‌ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని కొందరు అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే... కేరళలోని నాగర్‌ కోవిల్‌ లో ఒక సినిమా చిత్రీకరణ జరుపుతున్నారు. ఆ చిత్రంలో హీరోయిన్‌ గా మంజు సవేకర్‌ నటిస్తున్నారు. చిత్ర యూనిట్‌ సభ్యులందరికి కూడా స్థానికంగా ఉన్న ఒక హోటల్‌ లో బస ఏర్పాటు చేశారు. నిన్న షూటింగ్‌ పూర్తి చేసుకుని హోటల్‌ రూం కు వెళ్లిన హీరోయిన్‌ మంజు తన రూం క్లీన్‌ గా లేకపోవడంతో హోటల్‌ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేసింది. వారు సరైన సమాధానం చెప్పక పోవడంతో ఆమెకు మరింత కోపం వచ్చిందట. ఇద్దరి మద్య వాదనలు, ప్రతి వాదనలు తీవ్రంగా వచ్చాయి. దాంతో స్థానిక పోలీసులు రంగ ప్రవేశం చేసి మరీ గొడవకు ఫుల్‌ స్టాప్‌ పెట్టాల్సి వచ్చింది.