Begin typing your search above and press return to search.

అస‌లు పొగుడుతోందా? తిడుతోందా?

By:  Tupaki Desk   |   4 Dec 2015 6:36 AM GMT
అస‌లు పొగుడుతోందా?  తిడుతోందా?
X
న‌య‌న‌తార‌, నిత్యామీన‌న్ త‌ర్వాత అంతే ఛ‌రిష్మా, గ్లామ‌ర్‌తో ఆక‌ట్టుకుంటున్న మ‌ల్లూ బ్యూటీ కీర్తి సురేష్‌. ఈ ముద్దుగుమ్మ ఇటీవ‌లే రెండు తెలుగు ప్రాజెక్టుల‌కు సంత‌కాలు చేసింది. రామ్ స‌ర‌స‌న నేను ... శైల‌జ‌, సందీప్ కిష‌న్ స‌ర‌స‌న నేరం చిత్రాల‌కు సంత‌కాలు చేసింది. ప్ర‌స్తుతం ఈ సినిమాలు అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ స్థాయిలో ఉన్నాయి. ఈలోగానే కీర్తి పేరు టాలీవుడ్ అంత‌టా మార్మోగిపోతోంది. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిపై ఈ అమ్మ‌డి కామెంట్లు ప్ర‌స్తుతం టీ-టౌన్‌లో హాట్ టాపిక్ అయ్యాయి.

కీర్తి న‌టించిన ఒక్క సినిమా కూడా ఇంకా రిలీజ్ కాలేదు .. తెలుగు సినిమా ఇండ‌స్ర్టీ గురించి అంతా తెలిసిన‌ట్టే మాట్లాడుతోంది . తెలుగు ప్ర‌జ‌లు మారిపోయారు.. మైండ్ సెట్ మార్చుకున్నారు. ఇప్పుడు కేవ‌లం గ్లామ‌ర్ కోస‌మే సినిమాలు చూడ‌డం లేదు. కంటెంట్ కోసం పాకులాడుతున్నారు. ... అంటూ మాట్లాడింది. తెలుగులో సినిమాలు తెర‌కెక్కే స‌ర‌ళి మారింది. .. అంటూ కాంప్లిమెంట్లు ఇచ్చింది. అస‌లు తెలుగు వాళ్ల‌ను పొగుడుతోందా? తిడుతోందా? అన్న సందేహం క‌లిగేలా పొగిడేసింది కీర్తీ. తెలుగులో ఇంకా రెండు సినిమాల కిడ్‌. ఇంకా ఒక్క రిలీజ్ లేనేలేదు. అప్పుడే తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచుల్ని చ‌దివేసింది. ఒక‌వేళ తెలుగు నుంచి మ‌ల‌యాళంలోకి డబ్బింగ్ అయ్యే సినిమాలు చూస్తుందా ఏం?