Begin typing your search above and press return to search.

#గాడ్ ఫాద‌ర్.. వివేక్ ఒబేరాయ్ పాత్ర‌లో ఎవ‌రు?

By:  Tupaki Desk   |   26 Aug 2021 9:30 AM GMT
#గాడ్ ఫాద‌ర్.. వివేక్ ఒబేరాయ్ పాత్ర‌లో ఎవ‌రు?
X
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా మోహ‌న్ రాజా ద‌ర్శ‌క‌త్వంలో `గాడ్ ఫాద‌ర్` చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `లూసీఫ‌ర్` కి రీమేక్ ఇది. మాతృక‌లో స్టార్ క్యాస్టింగ్ లూసీఫ‌ర్ కి అద‌న‌పు బ‌లంగా నిలిచింది. ఈ నేప‌థ్యంలో రీమేక్ వెర్ష‌న్ లోనూ అంత‌కు ఏ మాత్రం త‌గ్గ‌కుండా స్టార్ ల‌నే దించుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే బాలీవుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ఓ కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్లు తెలుస్తోంది. మాతృకలో పృథ్వీ రాజ్ పోషించిన పాత్ర‌ను స‌ల్మాన్ పోషిస్తున్నారు.

ఇందులో ఆ పాత్ర కీల‌క‌మైనది. ఈ నేప‌థ్యంలో ఒరిజిన‌ల్ లో ని వివేక్ ఓబెరాయ్ పాత్ర‌ను మ‌ల‌యాళ న‌టుడు బిజు మీన‌న్ తెలుగు వెర్ష‌న్ లో పోషించ‌నున్న‌ట్లు స‌మాచారం. భీమ‌ల్ బాబా నాయ‌ర్ పాత్ర‌లో బిజు మీన‌న్ క నిపించ‌నున్నారు. ఈ పాత్ర ప్ర‌తినాయ‌కుడు ఛాయ‌లు క‌లిగి ఉంటుంది. పాత్ర లెంగ్త్ కూడా ఎక్కువ‌గా ఉంటుంద‌ని స‌మాచారం. బిజూ మీన‌న్ కి ఇది తెలుగులో మూడ‌వ చిత్రం. గ‌తంలో ఆయ‌న `ఖ‌త‌ర్నాక్` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు. అందులో ఆయ‌న లాయ‌ర్ పాత్ర‌లో క‌నిపించారు. కానీ ఆ సినిమా అంత‌గా స‌క్సెస్ సాధించ‌లేదు. ఆ త‌ర్వాత `ర‌ణం` సినిమాలో న‌టించారు. ఈ సినిమా మంచి స‌క్సెస్ అయింది.

బిజూ మీన‌న్ పాత్ర‌కు మంచి గుర్తింపు ద‌క్కింది. కానీ ఇక్క‌డ బిజీ న‌టుడు కాలేక‌పోయారు. చాలా గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ టాలీవుడ్ లో `గాడ్ ఫాద‌ర్` సినిమాతో కంబ్యాక్ అవుతున్నారు. మ‌ల‌యాళ చిత్రం `అయ్య‌ప్పునం కోషియమ్` లో బిజు మీన‌న్ కోషియ‌మ్ పాత్ర‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రాన్ని `భీమ్లా నాయ‌క్` టైటిల్ తో తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఇందులో బిజు మీన‌న్ పాత్ర‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్ పోషిస్తున్నారు.