Begin typing your search above and press return to search.

ఈ అమ్మడికి టాలీవుడ్‌ అంటే చిన్న చూపెందుకు?

By:  Tupaki Desk   |   15 Jun 2020 5:15 AM GMT
ఈ అమ్మడికి టాలీవుడ్‌ అంటే చిన్న చూపెందుకు?
X
సౌత్‌ లో అన్ని భాషల కంటే టాలీవుడ్‌ లో హీరోయిన్స్‌ కు ఎక్కువ పారితోషికం ఉంటుంది. పాత్ర తక్కువ ఉన్నా కూడా క్రేజ్‌ ను బట్టి కోట్లు కురిపించేందుకు దర్శక నిర్మాతలు సిద్దంగా ఉంటారు. అందుకే ఇతర భాషల హీరోయిన్స్‌ టాలీవుడ్‌ నుండి ఆఫర్‌ వస్తే ఖచ్చితంగా నటించాలని ఆశపడతారు. కాని మాళవిక మోహన్‌ మాత్రం టాలీవుడ్‌ నుండి ఇప్పటికి వచ్చిన రెండు ఆఫర్‌ లను కాదనుకున్నట్లుగా కోలీవుడ్‌ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది.

రజినీకాంత్‌ పెట్ట చిత్రంతో అలరించిన ఈ అమ్మడికి గత ఏడాదే టాలీవుడ్‌ నుండి పిలుపు వెళ్లింది. కాని ఆ సమయంలో వేరే సినిమాలకు కమిట్‌ అయ్యానంటూ నో చెప్పింది. ఇక ఈమె నటించిన ‘మాస్టర్‌’ చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. విజయ్‌ తో కలిసి నటించి ఈమె మరింత క్రేజ్‌ ను దక్కించుకుంది. ఈ సమయంలోనే ఈమెను రవితేజకు జోడీగా నటింపజేసేందుకు ఒక నిర్మాత చర్చలు జరిపాడట. కాని ఈసారి కూడా మాళవిక మోహన్‌ సేమ్‌ ఆన్సర్‌ రిపీట్‌ చేసిందని టాక్‌.

ప్రస్తుతం ఈమె తమిళంలో చేస్తున్న సినిమాలు పెద్దగా ఏమీ లేవు. అయినా కూడా ఎందుకు తెలుగు సినిమాలకు ఈమె ఓకే చెప్పడం లేదు అనేది చర్చనీయాంశంగా మారింది. ఆమద్య విజయ్‌ దేవరకొండ హీరోగా మొదలు అయిన ‘హీరో’ సినిమాకు ఈమెను అనుకున్నారు. ఆ సినిమా ప్రారంభం అయినట్లే అయ్యి క్యాన్సిల్‌ అవ్వడం వల్ల తెలుగు సినిమాలపై ఈమెకు ఆసక్తి తగ్గి ఉంటుందేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్‌ నుండి భారీ పారితోషికాలతో ఆఫర్లు వస్తున్నా ఈమె వాటిని పట్టించుకోక పోవడంపై తెలుగు ఆడియన్స్‌ ఈమెపై ఒకింత అసహనం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్‌ ను చిన్న చూపు చూస్తుందంటూ నెట్టింట కామెంట్స్‌ చేస్తున్నారు. మాళవిక మోహన్‌ ను ఎవరు మెప్పిస్తారు.. ఆమె టాలీవుడ్‌ లో సినిమా ఎప్పుడు చేయనుందో కాలమే నిర్ణయించాలి.