Begin typing your search above and press return to search.
సెల్ఫీ అందాలతో ఫిదా చేస్తున్న మాస్ రాజా భామ..!!
By: Tupaki Desk | 26 Dec 2020 3:00 PM ISTముంబై సుందరి మాళవిక శర్మ.. గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. ముఖ్యంగా తెలుగు యువత మాళవిక అంటే మనసు పారేసుకుంటున్నారు. తెలుగు సినిమాతోనే తన కెరీర్ ప్రారంభించిన ఈ ఇరవైఏళ్ళ చిన్నది.. ఒక్క సినిమాతోనే కుర్రాళ్లను తన బుట్టలో వేసుకుంది. ముంబైలో పుట్టిపెరిగిన మాళవిక.. మాస్ మహారాజ్ రవితేజ సరసన నేలటికెట్టు సినిమాతో వెండితెర పై ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫస్ట్ సినిమాలోనే ఎలాంటి మొహమాటం లేకుండా అందాలన్నీ ఆరబోసి మంచి క్రేజ్ సంపాదించుకుంది అమ్మడు. కాలేజీ టైంలోనే మోడలింగ్ ప్రారంభించిన మాళవిక.. కొన్ని టీవీ ఫేమస్ కమర్షియల్ యాడ్స్ హిమాలయ, మీరా కోకోనట్ ఆయిల్, సంతూర్, గ్లోయిన్ లాంటి వాటి యాడ్స్ లో మెరిసి సినిమా అవకాశం దక్కించుకుంది. ఇక ఫస్ట్ మూవీ ఆకట్టుకోలేక పోయినా మాళవిక వయ్యారాలకు ఫుల్ మార్కులే పడ్డాయి.
ఈ యంగ్ బ్యూటీకి ఇంస్టాగ్రామ్ లో 8 లక్షలకు పైగా ఫాలోయర్స్ ఉన్నారు. అమ్మడు ఏ పోస్ట్ పెట్టినా అభిమానులు ఆ పోస్టును అలా వైరల్ చేసేస్తారు. మాళవిక సోషల్ మీడియాలో యాక్టీవ్ గానే ఉంటుంది. వ్యక్తిగతంగా లాయర్ అవ్వాలని అనుకుని ఎల్.ఎల్.బి కూడా చదివింది. ఖాళీ దొరికితే చాలు ఈ భామ ఫోటోషూట్లతో ఇంస్టాగ్రామ్ లో అందాలు గుమ్మరిస్తోంది. కానీ మాళవిక ఫిగర్ చూస్తే ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. తాజాగా క్రిస్మస్ సందర్బంగా పోస్ట్ చేసిన పిక్ తెగ వైరల్ అవుతోంది. సాంటా డ్రెస్ లో కూడా గ్లామర్ షో చేయడం ఆపలేదు ఈ భామ. ఇలా మాళవిక అందాలతో ఫిదా చేసి హీరో రామ్ 'రెడ్' సినిమాలో అవకాశం అందుకుంది. ఇటీవల విడుదలైన రెడ్ ట్రైలర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో ఉంది. మరి ఈ సినిమా అయినా మాళవికకు మొదటి హిట్ అందిస్తుందేమో చూడాలి.