Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః ఇంతటి అందంకు అదృష్టం కలిసి రావడం లేదేంటో!

By:  Tupaki Desk   |   17 April 2021 5:34 AM GMT
ఫొటోటాక్‌ః ఇంతటి అందంకు అదృష్టం కలిసి రావడం లేదేంటో!
X
ముంబయి ముద్దుగుమ్మ మాళవిక శర్మ తెలుగులో నేల టికెట్‌ చిత్రంతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా ప్లాప్ అవ్వడంతో కాస్త గ్యాప్ వచ్చింది. ఆ సినిమా తర్వాత రెడ్‌ సినిమాలో ఆఫర్ వచ్చింది. రామ్ నటించిన ఆ సినిమా కూడా నిరాశ పర్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఆఫర్ల వేటలో ఉంది. అందంతో పాటు చక్కని అభినయం కూడా చేయగల సత్తా ఉన్న మాళవిక ఎందుకు అవకాశాలు దక్కించుకోలేక పోతుంది అంటూ ఆమె పై అభిమానం కనబర్చే వారు అంటున్నారు. తాజాగా ఆమె షేర్‌ చేసిన ఈ ఫొటో ఆమె అందంపై మరింతగా అభిమానులు ప్రశంసలు కురిపించే విధంగా ఉందంటున్నారు.

ఇంతటి అందంగా ఉన్న ఈ అమ్మడు ఎందుకు ఫిల్మ్‌ మేకర్స్ కు కనిపించడం లేదు అంటున్నారు. అందంగా లేని వారు ఎంతో మందికి ఆఫర్లు ఇస్తున్న దర్శకులు మాళవిక శర్మ ఫొటో షూట్స్ చూసిన తర్వాత అయినా ఆమెకు ఆఫర్‌ ఇవ్వాలంటూ నెటిజన్స్‌ కోరుకుంటున్నారు. మాళవిక శర్మ షేర్‌ చేసిన ఈ ఫొటో నెట్టింట వైరల్‌ అవుతోంది. బ్లాక్ అండ్‌ వైట్‌ లో కూడా మెరిసి పోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇప్పుడు కాకున్నా ముందు ముందు అయినా మాళవికకు అదృష్టం కలిసి వచ్చి ఖచ్చితంగా స్టార్‌ హీరోయిన్ గా ఆఫర్లను దక్కించుకుంటుందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.