Begin typing your search above and press return to search.

గోవా చెక్కేసిన నేల టికెట్ బ్యూటీ

By:  Tupaki Desk   |   15 Jun 2018 10:23 AM GMT
గోవా చెక్కేసిన నేల టికెట్ బ్యూటీ
X
రవితేజ మూవీ నేల టికెట్ తో టాలీవుడ్ తెరంగేట్రం చేసిన బ్యూటీ మాళవిక శర్మ. అందంగా ఉందనే పేరు అయితే వచ్చింది కానీ.. ఆ సినిమాలో రవితేజ పక్కన మరీ చిన్నగా ఉందని అనిపించుకుంది. ఇక సినిమా రిజల్ట్ సంగతి చెప్పాల్సిన పనేమీ లేదు.

టచ్ చేసి చూడుతో భారీ ఫ్లాప్ అందుకున్న మాస్ మహరాజ్ కు.. అంతకు మించిన ఫ్లాప్ మూవీగా మిగిలింది నేల టికెట్. దీంతో ఇప్పుడీ భామను పట్టించుకునే టాలీవుడ్ మేకర్స్ కరువైపోయారు. అసలే సెంటిమెంట్లకు తెగ ఇంపార్టెన్స్ ఇచ్చే తెలుగు సినిమా మేకర్స్.. మాళవిక శర్మను పట్టించుకోవడం మానేశారు. దీంతో ఇఫ్పుడు తనను తాను వార్తల్లో నిలుపుకోవాల్సిన అవసరం ఈ హీరోయిన్ కు ఏర్పడింది. అసలు జనాలకు వినిపించడం.. కనిపించడం మానేస్తే కొన్నాళ్లకు పూర్తిగా మరచిపోయే ప్రమాదం ఉంటుంది.

అందుకే సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ కు టచ్ లో ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది మాళవికా శర్మ. తాజాగా ఈ భామ గోవాలో ట్రిప్ వేస్తోంది. అక్కడి నుంచి హాట్ హాట్ ఫోటోలను షేర్ చేస్తోంది ఈ బ్యూటీ. ఇప్పటివరకూ ఓ 3 లక్షల మంది ఫాలోయిర్స్ ను సంపాదించుకున్న ఈమె.. పాతిక వేల లైక్స్ ను అయితే రాబట్టుకుంది. మరి ఇంకో సినిమాలో అవకాశం అందుకునేందుకు ఈ మాత్రం క్రేజ్ సరిపోతుందంటారా?