Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: మాళవిక మిసమిసలు

By:  Tupaki Desk   |   13 May 2019 5:28 PM GMT
ఫోటో స్టొరీ: మాళవిక మిసమిసలు
X
మాస్ మహారాజా రవి తేజ సినిమా 'నేల టికెట్' తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ మాళవిక శర్మ. మోడలింగ్ లో రాణిస్తున్న ఈ భామ లా స్టూడెంట్ అట. అదేదో అమ్మడి లక్కు సరిగా లేక 'నేల టికెట్' సక్సెస్ కాలేదు కానీ లేకపోతే ఈ పాటికి యూత్ కు హాట్ ఫేవరేట్ గా మారి ఉండేది. అంత ఫాస్ట్ ఈ భామ. చదువు పరంగా లా స్టూడెంట్ అయినా ఫ్యాషన్ కోర్సు చదివే స్టూడెంట్ లా సోషల్ మీడియాలో అందాలు ధారపోయడం ఈ పాపకు అమూల్ వెన్నతో పెటిన విద్య.

తాజాగా తన ట్రెండ్ ను కంటిన్యూ చేస్తూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోకు చాలా పెద్ద క్యాప్షన్ ఇచ్చింది. ఆ క్యాప్షన్ సారాంశాన్ని రఫ్ గా చెప్పుకుంటే.. "ఆ అమ్మాయి బొద్దుగా ఉంది అంటారు.. ఈ అమ్మాయి సన్నగా ఉంది అంటారు. ఇలా కామెంట్లు చేయడం ఆపేయాలి. నేను బరువు పెరిగానని నాకు ఊరికే హేట్ మెసేజులు వస్తున్నాయి.. అందుకే నా ఫోటోలు అప్లోడ్ చేయడం మానేశాను. నేను సన్నగా ఉన్నా ఒకే.. లావుగా ఉన్నా ఒకే.. ఒంపులు ఉన్నా ఒకే. బక్కగా ఒంపులు లేకున్నా ఒకే.. కానీ ఇలా ఒకరిని కామెంట్లు చేయడం మాత్రం నాట్ ఒకే" అంటూ చాలా పెద్ద మెసేజ్ పెట్టింది. పాప బాధ అర్థం అయింది కదా. ఊరికే సతాయించవద్దు అని చెప్పింది.

బాడీ షేమింగ్ గురించి ఆమె ఇచ్చిన క్లాస్ సంగతేమో కానీ ఫోటో మాత్రం అదిరిపోయింది. మిలిటరీ గ్రీన్ షార్ట్.. బ్లాక్ స్లీవ్ లెస్ టాప్ లో తన అందాలను సంకోచం లేకుండా ఆరబోసింది. ఆ కూర్చున్న పోజు కూడా యమా హాటు గా ఉంది. ఇది చూసి కూడా నెటిజనులు చూసి సంతోషపడకుండా బొద్దుగా ఉన్నావు.. వెయిట్ తగ్గు అంటే ఏం చేస్తాం. అందాలను ఆస్వాదించే టేస్ట్ లేదని సరిపెట్టుకుంటాం. ఇలా ట్రోలింగ్ చేస్తూ పోతే పాపకు మళ్ళీ కోపం వస్తుంది. అలా కోపం వస్తే ఇక ఇన్స్టా లో ఫోటోలు అప్లోడ్ చేయదు.. అలా చేస్తే అందాల ఫోటోలు ఉండవు.. ఏదీ తెగే దాకా లాగకూడదు కదా. ఈ విషయం చక్కగా అర్థం చేసుకున్నారేమో కానీ నెటిజనులు మాళవికను పొగడ్తలతో చంపేశారు. సెక్సీ అని.. డెడ్లీ పోజు అని.. క్యూట్ అండ్ సెక్సీ కాంబో అని.. ఎవరికి తోచినట్టు వారు మెచ్చుకున్నారు. ఒకరు మాత్రం "నిన్ను విమర్శించే జనాల కామెంట్లు మర్చిపో.. నువ్వు బ్యూటిఫుల్ గా ఉన్నావు" అంటూ సర్దిచెప్పే ప్రయత్నం చేశాడు.