Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: క్యూట్ పిల్లితో బ్యూటిఫుల్ పిల్ల

By:  Tupaki Desk   |   29 Jan 2019 2:10 PM GMT
ఫోటో స్టొరీ: క్యూట్ పిల్లితో బ్యూటిఫుల్ పిల్ల
X
మాళవిక శర్మ పేరు తెలుసు కదా? మాస్ మహారాజా రవితేజ సినిమా 'నేల టికెట్' తో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచిందిగానీ ఈ ముంబై భామ మాత్రం తన గ్లామర్ షో విషయంలో ప్రేక్షకులను ఏమాత్రం నిరాశపరచలేదు. సినిమాలలోనే కాదు.. సోషల్ మీడియాలో కూడా ఈ భామ చాలా యాక్టివ్.

తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా మాళవిక ఓ నాలుగైదు ఫోటోలు పోస్ట్ చేసింది. లా స్టూడెంట్ అయిన ఈ పాప ఫిట్నెస్ కోసం రోజూ బాడ్మింటన్ ఆడుతుందట. ఈమధ్య అలా ఆడుతూ గ్యాప్ లో ఇలా ఫోటోలు తీసుకొని వాటిని సోషల్ మీడియా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. ఈ బ్యూటీ ఈ ఫోటోలకు ఇచ్చిన క్యాప్షన్ "బ్యాడ్మింటన్ టైమ్ అండ్ లిటిల్ చిట్ చాట్. #నో మేకప్ లుక్ #నో ఫిల్టర్ నీడెడ్." అయినా మనపిచ్చిగానీ అందంగా ఉండే భామకు మేకప్.. ఫోటోలకు ఫిల్టర్లు అవసరమా?

ఒకవైపు ఫోన్ లో మాట్లాడుతూ..మరోవైపు ఓ పిల్లి పిల్లను ఒడిలో కూర్చోబెట్టుకొని నిమురుతూ ఒక స్మైల్ ఇచ్చింది. బ్యాడ్మింటన్ ఆడే గ్యాప్ లో క్యాట్ మింటన్ అన్నమాట. బ్లాక్ టీ-షర్ట్ వేసుకొని పైన రెడ్ కలర్ శాటిన్ జాకెట్ వేసుకుంది. బ్యాడ్మింటన్ కాబట్టి చిట్టిపొట్టి నిక్కర్ వేసుకుందేమో గానీ అది ఫోటోలో అసలేమాత్రం కనబడడం లేదు. తన కాళ్ళ అందాన్ని ఫుల్ గా ప్రదర్శించింది. బేర్ లెగ్స్ బ్యూటిఫుల్ గా ఉన్నాయని ఈ ఫోటోను చూసిన ఒక నెటిజనుడు కామెంట్ చేశాడు. మరో చిలిపి నెటిజనుడికి ఏం అనిపించిందో ఏమో గానీ 'లక్కీ పుస్సీక్యాట్' అని కామెంట్ పెట్టాడు.