Begin typing your search above and press return to search.

ఆ అమ్మాయే.. డైరెక్టర్ చెప్పేశాడు

By:  Tupaki Desk   |   30 Dec 2017 8:30 AM GMT
ఆ అమ్మాయే.. డైరెక్టర్ చెప్పేశాడు
X
రవితేజ కోసం సీరియల్ బ్యూటీ చాలా కలం తరువాత రాజా ది గ్రేట్ సినిమాతో హిట్ అందుకున్న మాస్ మహా రాజా రవితేజ ఇక నుంచి డిఫెరెంట్ సినిమాలను చేస్తాను అని చెప్పిన సంగతి తెలిసిందే. అంతే కాకుండా ఆ ఆలోచనతో కొంచెం స్లోగా కథలను ఒకే చేసే అవకాశం ఉండవచ్చని కూడా చెప్పాడు. కానీ మాస్ రాజా వేగం ఏ మాత్రం తగ్గడం లేదు. రాజా ది గ్రేట్ సినిమాకు ముందు అవకాశాలు వచ్చినా కూడా పట్టాలెక్కుతాయా అనే విషయంలో చాలా అనుమానాలు వచ్చాయి.

కానీ దర్శక నిర్మాతలు హీరో ఫామ్ లోకి రావడంతో సినిమాలను చాలా స్ట్రాంగ్ గా తెరకెక్కిస్తున్నారు. బడ్జెట్ విషయంలో ఏ మాత్రం అడ్డు చెప్పకుండా కాస్ట్లీ గా ప్లాన్ చేస్తున్నారు. ఇక రీసెంట్ గా రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో ఒక సినిమాను చేయడానికి ఒప్పుకున్నా సంగతి తెలిసిందే. సోగ్గాడే చిన్ని నాయన - రారండోయ్ వేడుక చూద్దాం తరువాత మూడవ సినిమా రవితేజ తో తీసి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు కళ్యాణ్ కృష్ణ. ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నాడు. అయితే హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే విషయంలో దర్శకుడు ఈ మధ్య చాలా మంది హీరోయిన్స్ కోసం సెర్చ్ చేశాడు.

ముందుగా కొంత స్టార్ హీరోయిన్స్ పేర్లు బాగానే వినిపించాయి. ఇక రీసెంట్ గా మాళవిక శర్మ అనే సీరియల్ యాక్టర్ ని ఒకే చేసారని వార్తలు వచ్చాయి. అయితే చిత్ర యూనిట్ నుంచి మొదట అధికారికంగా ఏ న్యూస్ రాలేదు. కానీ ఫైనల్ గా దర్శకుడు ఒకే చేశాడు. నార్త్ టీవీ యాక్టర్ మాళవిక శర్మ ఈ మధ్య బాగా ఫెమస్ అవుతోంది. సోషల్ మీడియాలో అమ్మడికి మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక కొన్ని ఫొటో షూట్స్ లో హాట్ స్టిల్స్ ఇచ్చి నెటిజన్స్ ని చాలా ఆకర్షిస్తోంది. గ్లామర్ తో పాటు కొంచెం డీసెంట్ గా కనిపిస్తుండడంతో కథకు కరెక్ట్ గా సెట్ అవుతుందని దర్శకుడు ఫైనల్ చేశాడని తెలుస్తోంది. మరి ఈ బ్యూటీ ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.