Begin typing your search above and press return to search.

పరీక్షలు అయిపోయాయ పిల్లా? మళ్లొచ్చావ్

By:  Tupaki Desk   |   28 Jun 2016 1:58 PM GMT
పరీక్షలు అయిపోయాయ పిల్లా? మళ్లొచ్చావ్
X
తెలుగు సినిమాల్లో హీరోయిన్స్ కి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి. ఏమున్నా ఏం లేకపోయినా.. అందాల ఆరబోత ఉండాలి. హీరోతో పాటల్లో చిందులేసే పాత్రలే అయినా మొహమాటం ఉండకూడదు. అందం కంటే దాన్ని ఆరబోసే ట్యాలెంట్ ఉండాలి. ముఖ్యంగా పక్క భాషల వాళ్లు అయిఉండాలి.. చాలామందికి ఇదే సూత్రం వర్తిస్తుంది.

ఎవరో నిత్యామీనన్ లాంటి ఒకరిద్దరికి మినహాయిస్తే ఛాన్సులు కావాలంటే మిగతావాళ్లంతా ఈ రూల్స్ తప్పనిసరిగా ఫాలో కావాల్సిందే. అయితే మరో నిత్యామీనన్ అని పొగిడించేసుకున్న మాళవికా నాయర్ పద్ధతి కాస్త తేడాగా ఉంది. మొదట ఎవడే సుబ్రమణ్యం సినిమా చేసి ట్యాలెంటెడ్ ఆర్టిస్ట్ అనిపించుకుంది. తీరా ప్రమోషన్స్ కి రమ్మంటే పరీక్షలున్నాయ్ కుదరదని చెప్పింది. రీసెంట్ గా కళ్యాణ వైభోగమే చిత్రానికి కూడా సేమ్ సిట్యుయేషన్. ప్రచారానికి రమ్మంటే ఎగ్జామ్స్ ఉన్నాయంటూ ఎస్కేప్ అయిపోయింది. ఈ భామ అప్పుడు కనిపించడమే... మళ్లీ ఇప్పుడు హైద్రాబాద్ లోని ఇనార్బిట్ మాల్ లో జరిగిన ఎయిరేషియా ఈవెంట్ లో కనిపించింది.

సినిమాలకు అడిగినప్పుడు డేట్స్ ఇస్తూ.. ఆ తర్వాత ప్రమోషన్స్ అంటే మాత్రం ఎస్కేప్ అవుతుండడంతో.. ఈమెకు ఆఫర్స్ ఇచ్చేందుకు నిర్మాతలు వెనకాడుతున్నారని తెలుస్తోంది. పైగా ఎక్స్ పోజింగ్ చేయనే చేయనని ఖరాఖండీగా తేల్చేయడం కూడా.. ఈమెకు కొత్త ఆఫర్స్ అందడంలో ప్రభావం చూపిస్తోందని టాక్.