Begin typing your search above and press return to search.

సిగరెట్ కాల్చేస్తున్న మాళవిక

By:  Tupaki Desk   |   26 Nov 2015 11:00 PM IST
సిగరెట్ కాల్చేస్తున్న మాళవిక
X
ఈ ఏడాది బెస్ట్ పిక్చర్ పోటీల్లో నిలబడుతున్న తెలుగు సినిమాల్లో ఎవడే సుబ్రమణ్యం కూడా ఒకటి. ఈ మూవీ ఇంతగా ఆకట్టుకోవడానికి హీరో నానితోపాటు.. హీరోయిన్ మాళవికా నాయర్ పెర్ఫెమెన్స్ కూడా కారణమే. ఈ భామ ఇప్పుడు మరో చిత్రంతో మన ముందుకొస్తోంది.

నందినీ రెడ్డి డైరెక్షన్ లో రూపొందుతున్న ఫ్యామిలీ మూవీ కళ్యాణ వైభోగమే చిత్రంలో.. నాగశౌర్య పక్కన కనిపించనుంది మాళవికా నాయర్. మొత్తం క్యాస్టింగ్ అంతటినీ.. పెళ్లి తర్వాత ఓ జంటతో దిగిన సెల్ఫీనే.. ఫస్ట్ లుక్ గా ఇచ్చి ఆకట్టుకుందీ చిత్రం. ఈ మూవీలో మాళవిక చేస్తున్న పాత్ర పేరు ఆనంది. ఈ కేరక్టర్ కి చాలా ఇంపార్టెన్స్ ఉందని, స్టోరీలో మెయిన్ ట్విస్ట్ లన్నీ ఈమె చుట్టూనే తిరుగుతాయని తెలుస్తోంది.

కీలకమైన ఆనంది పాత్ర పెర్ఫామెన్స్ చేయగల హీరోయిన్ కావడంతోనే ఈమెను ఎంచుకున్నారట. చూడ్డానికి కూడా నిత్యామీనన్ లా కనిపిస్తుండడం మాళవికకు ప్లస్ పాయింట్ అంటున్నారు. అంతే కాదు సిగరెట్ కాల్చే స్టిల్స్ కూడా ఇచ్చేస్తోందంటే.. కేరక్టర్ కోసం ఏం చేయడానికైనా రెడీయే అనేట్లుగా ఉందీ చిన్నది. చూస్తుంటే.. యాక్టింగ్ విషయంలో నిత్యకు పోటీ ఇవ్వగల హీరోయిన్ రెడీ అయిపోయినట్లుగా ఉంది.