Begin typing your search above and press return to search.

నాని హీరోయిన్‌ సత్తా ఇది!!

By:  Tupaki Desk   |   27 Jun 2015 4:06 AM GMT
నాని హీరోయిన్‌ సత్తా ఇది!!
X
నిండా పదిహేడేళ్ళు లేవు.. ఈ పిల్ల హీరోయిన్‌ ఏంటి అన్నారట కొందరు.. ఆమె పేరు మాళవికా నాయర్‌. మల్లూ బేబి. అయితే ఇంకా కాలేజ్‌ కూడా పూర్తి కాని ఈ పిల్లను ''ఎవడే సుబ్రమణ్యం'' సినిమాలో హీరోయిన్‌గా తీసుకున్నందుకు అందరూ పెదవి విరిచారు. కాని సినిమా చూశాక ఈమె యాక్టింగ్‌కు అందరూ పడిపోయారు. అందుకే ఈమెను నందినీ రెడ్డి తదుపరి చేస్తున్న నాగ శౌర్య ప్రాజెక్టుకు హీరోయిన్‌గా తీసుకుంది.

ఇదంతా సరే.. ఇప్పుడు ఈ పదిహేడేళ్ల పిల్ల.. తన అద్బుతమైన నటనకు గాను తొలిసారిగా ఫిలిం ఫేర్‌ ''బెస్ట్‌ యాక్టర్‌ (ఫిమేల్‌) అవార్డును దక్కించుకుంది. అదేం తన మాతృబాష మలయాళంలో చేసిన సినిమాకు కాదండోయ్‌.. అమ్మడు తమిళంలో ''కుకూ'' అనే సినిమా చేసింది. ఈ సినిమాలో కళ్ళు లేని అమ్మాయి పాత్రలో ఇరగదీసేసింది. ఈ సినిమాలో నటనకు ఆమెకు ఉత్తమ నటి అవార్డు వరించింది. పైగా ఈమెకు పోటీగా నిలిచిన భామలేమైనా చిన్నోళ్ళా.. కాదే.. అమలాపాల్‌, సమంత, క్యాథరీన్‌ త్రెసా కూడా అద్భుతంగా నటించిన పాత్రలతో రేసులో ఉన్నారు. అయినాసరే అందరినీ బీట్‌ చేసి మాళవిక అవార్డు కొట్టేసిందంతే.